అధ్యక్షులు గా ఎన్నికైన పల్నాటి రఘు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్‌లోని దుబ్బ తర్ప 27 పద్మశాలి సంఘం ఆదివారం తమ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతూ, సంఘ సభ్యులందరూ కలిసికట్టుగా తమ నాయకత్వాన్ని ఎంపిక చేసుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా పల్నాటి రఘు ఎన్నికయ్యారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వర్ కోశాధికారిగా శ్రీపతి నరేష్ బాధ్యతలు చేపట్టారు. సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా నక్క కృష్ణ, ఉపాధ్యక్షుడిగా గడ్డం నర్సింలు, సహాయ కార్యదర్శిగా ఉడుత శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన ఈ నాయకత్వం సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తుందని సంఘ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.