| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎల్ నినో ప్రభావంతో సిరిసిల్లలో తాగునీటి కొరత - నల్ల కనెక్షన్లకు ఆన్/ఆఫ్ వాల్వులు తప్పనిసరి... మున్సిపల్ కమిషనర్

ఎల్ నినో ప్రభావంతో సిరిసిల్లలో తాగునీటి కొరత - నల్ల కనెక్షన్లకు ఆన్/ఆఫ్ వాల్వులు తప్పనిసరి... మున్సిపల్ కమిషనర్


డైలీ భారత్, సిరిసిల్ల: ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో తాగునీటి వృధాను అరికట్టేందుకు సిరిసిల్ల మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రజలందరూ తమ మున్సిపల్ నల్ల కనెక్షన్లకు ఆన్/ఆఫ్ వాల్వులు ఏర్పాటు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు అక్టోబర్ 14న పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎల్ నినో ప్రభావం కారణంగా ఎండల తీవ్రత పెరిగి, నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని, అందువల్ల తాగునీటిని పొదుపుగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో సిరిసిల్ల పట్టణంలోని మున్సిపల్ నల్ల కనెక్షన్లు కలిగిన ప్రతి ఇంటి యజమాని తమ నల్ల కనెక్షన్లకు తప్పనిసరిగా ఆన్/ఆఫ్ వాల్వులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా అవసరమైనప్పుడు మాత్రమే నీటిని వినియోగించుకోవడంతో పాటు, నీటి వృధాను అరికట్టవచ్చని తెలిపారు.

ఈ సూచనలను పాటించని వారిపై మున్సిపల్ నిబంధనల ప్రకారం అపరాధ రుసుము విధించడంతో పాటు, నిబంధనలకు అనుగుణంగా నల్ల కనెక్షన్ తొలగింపు చర్యలు చేపట్టబడతాయని హెచ్చరించారు.

సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ పురపాలక సంఘానికి సహకరించి, తాగునీటిని వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు.

Previous కామారెడ్డిలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య, దోపిడీ కేసు ఛేదింపు... భార్యాభర్తలు అరెస్ట్
ADVERTISEMENT