| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అశ్వారావుపేటలో చెరువులు మురుగుగుంటలుగా మారుతున్నాయి... బీజేపీ ఆందోళన

అశ్వారావుపేటలో చెరువులు మురుగుగుంటలుగా మారుతున్నాయి... బీజేపీ ఆందోళన

అశ్వారావుపేట నియోజకవర్గంలో చెరువులను కాపాడండి... బీజేపీ డిమాండ్

డైలీ భారత్, అశ్వారావుపేట (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెరువులను కాపాడాలని బీజేపీ నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి వనరులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, చెరువులు చెత్తాచెదారంతో నిండిపోయి ప్రాణవాయువు కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులను వెంటనే బాగు చేయాలని, పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని కోరారు.

"ఒకప్పుడు తాగునీటికి, సాగునీటికి నిలయాలుగా ఉన్న చెరువులు నేడు ఆక్రమణలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, గుర్రపుడెక్క, చెత్తాచెదారంతో నిండిపోయి మురుగు గుంటలుగా మారుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వీడి తక్షణమే స్పందించాలి" అని ఆయన అన్నారు. చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, జల వనరులు బాగుంటేనే సమస్త జీవరాశులు బాగుంటాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గొట్టి పుల్లా శ్రీనివాసరావు, దమ్మపేట మండల అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు, దారా నాగేశ్వరరావు, ఉడతనేని విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


 #Aswaraopeta #BhadradriKothagudem

Previous బీబీపేట్‌లో దుర్గామాతకు ప్రత్యేక పూజలు... గ్రామ అభివృద్ధికి మొక్కులు
Next బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టినా భద్రత లేనట్టేనా?
ADVERTISEMENT