| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జిల్లాలో ప్రారంభమైన జనహిత పాదయాత్ర

జిల్లాలో ప్రారంభమైన జనహిత పాదయాత్ర

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జై బాపు, జై బీం, జైసంవిధాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ ను సమాయాత్తం చేసేందుకు ఉద్దేశించిన కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర జిల్లాలో ప్రారంభమైంది. ఏఐసీసీ ఇంచార్జీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఆర్మూర్ లో పాదయాత్ర ప్రారంభమైంది. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ లో జనహిత పాదయాత్ర కార్యక్రమం ఏర్పాటు చేయగా మీనాక్షీ నటరాజ్ కాంగ్రెస్ జండాను ఎగురవేసి పాదయాత్రను ప్రారంభించారు. పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్కతో కలిసి పాదయాత్ర చేశారు. పాదయాత్ర ఆర్మూర్ పట్టణంలో వీధుల గుండా సాగింది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రభుత్వ సలహదారు షబ్బీర్ ఆలీ, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతిరెడ్డి, మదన్ మోహన్ రావు, లక్ష్మీ కాంత్ రావు, కార్పోరేషన్ ల చైర్మెన్ లు ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, కాసుల బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. శనివారం రాత్రి ఆర్మూర్ లో బస చేసి ఆదివారం ఉదయం కార్యకర్తల సమావేశంలో మీనాక్షీ నటరాజన్ పాల్గొంటారు.


Previous మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించిన వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు
Next దేవుడి కోసం ఆత్మార్పణం…?
ADVERTISEMENT