| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శంభుని గుడి ఆలయ నూతన కార్యవర్గం ఓకే

శంభుని గుడి ఆలయ నూతన కార్యవర్గం ఓకే

ఇకనైనా నూతనంగా ఎన్నికైన చైర్మన్ ఆలయం చుట్టూ పరిసరాల్లో అక్రమంగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటారా..?

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ లో ఎంతో ప్రాచీనమైన ఆలయాల్లో స్వయంభుగా వెలసిన శంభు లింగేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధికెక్కింది. స్వయంభుగా శంభు లింగేశ్వరుడు ఇక్కడ ఉద్భవించడంతో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అయితే సోమవారం శంభు లింగేశ్వర ఆలయానికి నూతన కమిటీ ఎన్నిక అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇదంతా నానానికి ఒకవైపు అయితే ఇదే గుడి చుట్టూ అక్రమంగా కొందరు గుడి ప్రాంగణ స్థలాన్ని కబ్జా చేసి మరి తమ వ్యాపారాలకు అనువైన స్థలంగా మలుచుకుంటూ ఇన్నాళ్లు వస్తు  ఉన్నారు. ఇందుకోసం హిందుత్వ వాదులు అంతా కలిసి ఉద్యమాలు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి ఆలయ చుట్టు పరిసరాల్లో ఉన్న అక్రమ కబ్జాలను తొలగించాలని ఉద్యమాలను సైతం చేపట్టారు. అయితే నూతనంగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన నూతన పాలకవర్గం చైర్మన్ ఈ విషయంలో స్పందిస్తారా ఆలయ పరిసరాల్లో  అక్రమాలను  తొలగించే విధంగా చర్యలు తీసుకుంటారా లేదా అనేది హిందుత్వవాదులకు ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. వాటన్నిటినీ తొలగించి ఆలయ స్థలాన్ని ఆలయానికి వచ్చేలా చైర్మన్ చొరవ చూపాలని భక్తులు కోరుతున్నారు.


Previous ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవోఎస్ ఉద్యోగులు
Next సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఘటనపై సుమోటో కేసు నమోదు
ADVERTISEMENT