డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా విచ్చేసిన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని టీఎన్జీవోస్ పక్షాన ఎంప్లాయిస్ జేఎసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్ అండ్ బి వసతిగృహం లో జరిగిన ఈ భేటీలో టీఎన్జీవో నాయకులు షబ్బీర్ అలీని శాలువాతో సత్కరించి, ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఉద్యోగుల సమస్యలను సావధానంగా విన్న షబ్బీర్ అలీ , తక్షణమే సానుకూలంగా స్పందించి, ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ఆయన చూపిన ఈ తక్షణ స్పందనకు టీఎన్జీవోఎస్ పక్షాన హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా కోశాధికారి టి. దినేష్ బాబు సంయుక్త కార్యదరి రాఫర్ హుస్సేన్ కూడా పాల్గొన్నారు.
News
ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవోఎస్ ఉద్యోగులు