Posted on 2025-07-27 17:56:27
ఒక డాక్టర్ అయినా రూరల్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో డెంగ్యూ, విష జ్వరాలు ప్రబలుతుంటే సోయిఉందా..?
డైలీ భరత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్ పోల్ గ్రామంలో డెంగ్యూ ప్రభావం తీవ్రంగా ఉందని వార్త వినడంతో వెంటనే ఆ గ్రామంలో ప్రజలు జ్వరాలతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వెంటనే నియోజకవర్గ ప్రజలతో కలసి గ్రామం లో పర్యటించారు బాధితులకు బిస్కెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ
మోపాల్ మండలం లోని కల్ పోల్ గ్రామ ప్రజలు వెంటనే డెంగ్యూ జ్వరాల తో కోలుకోవలని భగవంతుడిని వేడుకున్నారు రూరల్ ఎమ్మెల్యే ఒక వైద్యుడిగా ప్రజల బాధ్యత మీ పై ఉంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందుబాటులో ఉంచే విదంగా వారిని తరలించాలని వేడుకున్నారు. ప్రైవేట్ పాఠశాలలో కాకుండా ప్రజలను జిల్లా ఆసుపత్రికి తరలించాలి. కాల్ పోల్ గ్రామంలో 24 గంటలు అందుబాటులో ఉండే వైద్యుడిని నియమించాలి" అని బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పటేల్ అధికారులను కోరారు.
అలాగే, కొన్ని కుటుంబాలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఆర్థికంగా కుదేలవుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తక్షణ సాయం అందించాలంటూ సీఎంఆర్‌ఎఫ్ నిధుల ద్వారా ఆర్థిక సహాయానికి ఎమ్మెల్యే చోరువా చూపాలని అన్నారు
ఇది రాజకీయాల వ్యవహారం కాదు... ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావాలనే ఆలోచనతోనే ఇక్కడికి వచ్చాను" అని ఆయన స్పష్టం చేశారు. గ్రామ ప్రజలు పరిశుభ్రత పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎటువంటి అవసరం ఉన్నా నన్ను నేరుగా సంప్రదించండి. జిల్లా కలెక్టర్ ఇక్కడి ప్రజలకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఇక్కడ వెంటనే ఆశ వర్కర్ తో పాటు ఏఎన్ఎం ను కూడ నియామియించాలని కోరారు ఇక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ప్రజలు విష జ్వరాలతో కొట్టుమిట్టడుతున్నారు శానిటేషన్ సిబ్బంది తో ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలనీ అన్నారు
ఈ కార్యక్రమం లో రూరల్ కన్వీనర్ పద్మ రెడ్డి,మండల అధ్యక్షులు శశాంక్,మాజీ మండల అధ్యక్షులు రవి, కార్పొరేటర్ ప్రమోద్,మాజీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, నాయకులు చిన్న రెడ్డి, కిషన్, కృష్ణ నాయక్,ఓం సింగ్,రమేష్ నాయక్, నరేందర్ రాథోడ్,శంకర్ రెడ్డి, తిరుపతి, జగన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
సిరిసిల్లలో కమ్యూనిటీ కాంటాక్ట్... 60 వాహనాలు స్వాధీనం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసుల సూచన
Posted On 2026-07-25 07:31:14
Readmore >
ప్రజల ప్రాణాలతో చెలగాటం... మల్కాజిగిరి కేక్స్ క్లబ్ బేకరీపై కేసు
Posted On 2026-07-25 07:06:03
Readmore >
ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన అంబులెన్స్ సిబ్బంది ...
Posted On 2026-07-25 04:00:34
Readmore >
రాఘవపూర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు
Posted On 2026-07-24 19:19:00
Readmore >
కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్
Posted On 2026-07-24 19:17:19
Readmore >
జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
Posted On 2026-07-24 17:38:47
Readmore >
దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు
Posted On 2026-07-24 16:54:48
Readmore >