Posted on 2025-07-22 18:54:51
ధర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయన్ని పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్. ధర్పల్లి సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. ముందుగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పోలీస్ కమిషనర్ నిజామాబాద్ ఏసిపి, ధర్పల్లి ఇన్స్పెక్టర్, ధర్పల్లి ఎస్సై, సిరికొండ ఎస్సైలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఫైల్స్ ను క్షుణ్ణంగా తనిఖీ లు నిర్వహించారు. పోలీస్ విభాగము నిర్విరామముగా నిర్వహిస్తున్న పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల యొక్క భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. ధర్పల్లి సర్కిల్ పరిధిలోని రికార్డ్ లను పరిశీలిస్తూ , అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని , ప్రతి కేసులో నాణ్యమైన , ఇన్వెస్టిగేషన్ చేయాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ కు సూచనలు చేశారు. ఈ సర్కిల్ పరిధిలో సైబర్ నేరాల జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు , కళాశాలలో సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాలలో విలేజ్ పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేసి , అట్టి గ్రామాలలో ఉన్నటువంటి సమాచారము తమపై స్థాయి అధికారులకు ఎల్లప్పుడూ చేరవేయాలి అన్నారు. ప్రతి రోజు ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలని సూచించారు. సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాధించాలనే అత్యాశతో యువత ఆన్లైన్ బెట్టింగ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ, సైబర్ మోసగాళ్ళ చేతిలో చిక్కి డబ్బులు కోల్పోతూ అప్పులు చేసి, చేసిన అప్పులను తీర్చలేక తనువును చాలిస్తున్నారని అన్నారు. గేమింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులు మరియు సిబ్బంది 24X7 తమ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని , దూర ప్రాంతాల నుండి ప్రయాణాలకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఏ.సి.పి రాజా వెంకటరెడ్డి , ధర్పల్లి సిఐ శ్రీ బిక్షపతి , ధర్పల్లి ఎస్.ఐ ఎం. కళ్యాణి , సిరికొండ ఎస్.ఐ జె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
జిల్లా కోర్టు ప్రాంగణంలో Special Intensive Revision (SIR) కోసం తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాన జిల్లా న్యాయమూర్తి
Posted On 2026-07-21 15:56:05
Readmore >
సిరిసిల్ల : 19వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం
Posted On 2026-07-21 15:22:53
Readmore >
తిమ్మారెడ్డి గ్రామంలో ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
Posted On 2026-07-21 15:01:38
Readmore >
సిరిసిల్లలో మైనర్ బాలికపై వేధింపుల నిందితుడికి 10 ఏళ్ల జైలు, 2000 జరిమానా
Posted On 2026-07-21 14:56:26
Readmore >
నీట్ పేపర్ లీకేజీ వివాదం : ప్రధాని నివాసం ముందు ప్రతిపక్ష అగ్రనేతల ఆందోళన
Posted On 2026-07-21 13:45:51
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్లకు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చొరవ
Posted On 2026-07-21 12:52:04
Readmore >