| Daily భారత్
Logo




సీఎం స్టాలిన్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది : వైద్యుల బృందం

News

Posted on 2025-07-21 11:28:42

Share: Share


సీఎం స్టాలిన్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది : వైద్యుల బృందం

డైలీ భారత్, తమిళనాడు:తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ఇవాళ (జూలై 21న) ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మార్నింగ్‌ వాక్ చేస్తుండగా కల్లు తిరగడం లాంటి లక్షణాలు కనిపించడంతో.. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ఇక, అపోలో హాస్పిటల్‌ వైద్య బృందం సీఎం స్టాలిన్ ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నారు. అయితే, స్టాలిన్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని హాస్పిటల్‌ వర్గాలు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశాయి.

ఇక, అపోలో హాస్పిటల్స్‌ డైరెక్టర్ డాక్టర్‌ అనిల్ బీజీ మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం మార్నింగ్ వాక్ సమయంలో సీఎం స్టాలిన్‌కు తీవ్ర అస్వస్థత కలిగింది.. కళ్లు తిరగడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేస్తున్నాం.. వైద్యుల బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తోంది అని వెల్లడించారు. ఈ మేరకు సీఎం ఆరోగ్య పరిస్థితిపై ఆధికారిక హెల్త్‌ బులెటిన్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రి వద్ద భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు.


#tamilnadu #stalin 

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >