Posted on 2025-07-14 08:45:35
గుంజె హన్మంతు భార్యకు పోన్ చేసి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు గుంజె హన్మంతు మృతుపట్ల మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. గుంజె మృతి వార్త తెలియగానే ఆయన భార్యకు పోన్ చేసి ప్రగాఢసానుభూతి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు గుంజె హన్మంతు మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటన్నాడు. వయస్సును సైతం లెక్కచేయకుండా తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కిన గుంజె మానుకోటకు ఐకాన్ గా నిలిచాడని శ్లాఘించారు. లాఠీలకు, తూటాలకు, జైళ్లకు వెరవని గుంజె పోరాట పటిమ భావితరాలకు కరదీపికలాంటిదని అన్నాడు. గుంజె కుటుంబానికి సహాయసహకారాలు అందజేస్తానని అన్నాడు. అనంతరం గుంజె హన్మంతు మృతిపట్ల ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఎమ్మెల్యే మురళీ నాయక్ వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు శంతన్ రామరాజు వున్నాడు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >