| Daily భారత్
Logo




సమాజ సేవలో ఫారెన్సిక్ వైద్యుల పాత్ర ప్రధానం : విభాగాదధిపతి డాక్టర్ లక్ష్మణ్ రావు

News

Posted on 2025-07-12 14:16:15

Share: Share


సమాజ సేవలో ఫారెన్సిక్ వైద్యుల పాత్ర ప్రధానం : విభాగాదధిపతి డాక్టర్ లక్ష్మణ్ రావు

డైలీ భారత్, వరంగల్: నేర నిరోధం లోగాని, విచారణలో గాని ఫోరెన్సిక్  నిపుణులు సమాజానికి ఎంతో సహాయకారిగా ఉండి వారి సేవలను అందిస్తారని తెలంగాణ ఫోరెన్సిక్ మెడిసిన్ జనరల్ సెక్రెటరీ మరియు కాకతీయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ సిహెచ్ లక్ష్మణరావు అన్నారు. 

కాకతీయ వైద్య కళా శాల ఎన్ఆర్ ఐ భవన్లో రెండు రోజుల రాష్ట్ర స్థాయి సదస్సు ముగింపు ఆదివారం సాయంత్రం జరిగింది. ముగింపు ఉపన్యాసం చేస్తూ డాక్టర్ లక్ష్మణ్ రావు... నేరం జరిగిన ప్రదేశం లో ఆధారాల సేకరణ, నేర సంబదీకుల భౌతిక ఆధారాల సేకరణ, కోర్టుల్లో జరిగే  విచారణ ప్రక్రియలో సహాయం అందించడం ద్వారా ఫోరెన్సిక్ వైద్యులు తమ సేవలను సమాజానికి అందిస్తారన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో నేరాలను నిరోధించే ప్రక్రియలో కూడా ఈ నిపుణులు తమ సేవలను అందిస్తారని కొనియాడారు.  రెండు రోజులపాటు జరిగిన చర్చ సమావేశాల ద్వారా నైపుణ్యాలను పెంచుకున్న వైద్యులు తమ సేవలను మరింతగా అందించాలని పిలుపునిచ్చారు.

సదస్సుల్లో కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య, ఫోరెన్సిక్ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అభిజిత్ సుబేదా, ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యవిభాగాధిపతి డాక్టర్ శ్రీధరరాచారి, గాంధీ ఆస్పత్రి వైద్య విభాగాధిపతి డాక్టర్ కృపాసింగ్, మేజర్ డాక్టర్ నవీన్, కాకతీయ మెడికల్ కళాశాలతో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఫోరెన్సిక్ డాక్టర్లు పాల్గొన్నారు. అనంతరం ఫోరెన్సిక్ డాక్టర్ల జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >