| Daily భారత్
Logo




మూడు బంగారు పతకాలు సాధించిన గారపాటి సూర్యనారాయణ కి మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు అభినందనలు

News

Posted on 2025-07-11 17:13:59

Share: Share


మూడు బంగారు పతకాలు సాధించిన గారపాటి సూర్యనారాయణ కి మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు అభినందనలు

గారపాటి సూర్య చదువుల్లో ఘనాపాటి మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్, మాజీ దిశా కమిటీ సభ్యులు గారపాటి సూర్యనారాయణ (సూర్య) విద్యారంగంలో అరుదైన ఘనత సాధించారు. 2020 సంవత్సరానికి గాను కాకతీయ యూనివర్సిటీలో టాపర్‌గా నిలిచిన సూర్య, ఇటీవల జరిగిన కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మూడు బంగారు పతకాలను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా అందుకున్నారు.  ఈ సందర్భంగా శుక్రవారం నాడు హైదరాబాద్ లో బిఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావును తన కార్యాలయంలో గారపాటి సూర్య మర్యాదపూర్వకంగా కలిశారు.  సూర్య సాధించిన విజయం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు గర్వకారణమని, చదువు ద్వారా యువత ఎంత ఉన్నత స్థాయికి చేరగలరో సూర్య సాధించిన విజయం మంచి ఉదాహరణ అని ప్రశంసించారు.  గారపాటి సూర్య చదువుల్లో ఘనాపాటి అని పేర్కొంటూ మూడు బంగారు పతకాలను నామ తన చేతుల మీదుగా మరోసారి సూర్య మెడలో వేసి, అభినందన పత్రం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. చదువుతో పాటు సేవా దృక్పథం కలిగి ఉన్న యువకుడిగా సూర్యను అభివర్ణించారు.  సూర్య విద్యార్హతలు విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి అన్నారు.  తన లాగే ఓ సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిన సూర్య చిన్న వయసులోనే గ్రామ స్థాయిలో నాయకత్వ బాధ్యతలు చేపట్టి, ఉప సర్పంచ్‌గా ప్రజలకు సేవలు అందించటం తో పాటు  పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారని, గతంలో పదిహేడవ లోక్ సభ లో ఎంపీ గా ఉన్నప్పుడు సూర్య దిశా కమిటీ సభ్యునిగా మందలపల్లి గ్రామాభివృద్ధికి కృషి చేసారని గుర్తు చేసుకున్నారు.  గారపాటి సూర్య విద్యపై ఉన్న శ్రద్ధ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతోనే ఈ స్థాయికి ఎదగగలిగారని నామ అన్నారు. తన విద్యను సమాజానికి ఉపయోగపడేలా మలచుకోవాలని ఆశయంతో ముందుకు సాగుతున్న సూర్య ఇప్పటికే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు కంప్యూటర్స్ లో రెండు, ఎలక్ట్రానిక్స్, న్యాయశాస్త్రం లో ఒక్కోటి చొప్పున నాలుగు డిగ్రీలు పూర్తిచేసి ప్రస్తుతం న్యాయశాస్త్రంలో డాక్టరేట్ చేయడం కోసం పరిశోధనలు కొనసాగిస్తున్నానని నామకు తెలిపారు.  నామ మాట్లాడుతూ ఈవిధంగా గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన యువత విద్య, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ఈస్థాయికి ఎదగడం అందరికి ప్రేరణనిచ్చే విషయం అని నామ అన్నారు.  ఉమ్మడి జిల్లాలో యువతకు సూర్య ఒక మార్గదర్శకంగా నిలవాలన్నారు. సూర్య మాట్లాడుతూ.తనకి ఈ గుర్తింపు కేవలం తన వ్యక్తిగత శ్రమ వల్ల మాత్రమే కాదు, తన కుటుంబం, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజల మద్దతుతో సాధ్యమైందన్నారు. తనకి మార్గదర్శకుడిగా ఉన్న నామ తో భవిష్యత్ లో సేవా కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పారు.  గారపాటి సూర్య ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ విద్యతో పాటు తన సేవా దృక్పథాన్ని కొనసాగిస్తున్నారు. ఫీడ్ ద నీడ్ స్వచ్చంద సంస్థ ద్వారా ఎందరో అభాగ్యులకు అండగా నిలుస్తూ వారి ఆకలి తీరుస్తున్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన చదువు ద్వారా సుదూర గమ్యాలను చేరగలమన్న సందేశాన్ని సూర్య విజయగాథ అందిస్తున్నది, నామ నాగేశ్వరరావు ఆశీస్సులతో  సూర్యనారాయణ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు..

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >