| Daily భారత్
Logo




ఇండస్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

News

Posted on 2023-12-14 08:31:51

Share: Share


ఇండస్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

వైజాగ్ ఇండస్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

డైలీ భారత్, వైజాగ్ :విశాఖపట్నం జగదాంబ జంక్షన్‌లో ఉన్న ఇండస్‌ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని  ప్రమాదం సంభవించింది.

ఆస్పత్రిలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. రెండవ అంతుస్తులోని ఆపరేషన్‌ థియేటర్‌లో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.

మంటల్లో పలువురు రోగులు చిక్కుకున్నారు. కొందరు భయంతో పరు గులు తీస్తుంటే మరికొంత మందిని ఆస్పత్రి సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బయటకు వచ్చిన వారిని దగ్గరలోని వేరొక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆస్పత్రి పరిసరాల్లో దట్టంగా పొగ అలముకుంది. నాలు గు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు ఫైర్‌ సిబ్బంది.

మంటలు ఆర్పేందుకు సహా యక చర్యలు కొనసాగు తున్నాయి. పొగలో చిక్కు కున్న రోగులు కాసేపు ఊపి రి అందక ఉక్కిరి బిక్కిరి అయ్యారు.

ఆసుపత్రి మంటల్లో చిక్కు కున్న అందరినీ బయటకు తీసుకొచ్చారు అసుపత్రి సిబ్బంది. నైట్రస్ ఆక్సైడ్ కారణంగా సిలిండర్ పేలి ఆపరేషన్ థియేటర్లో ముందుగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

ఐసీయూలో ఉన్న ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండ టంతో దగ్గర్లోని మరో ప్రైవే ట్ ఆసుపత్రికి తరలించారు.  ఆపరేషన్ థియేటర్లో మొత్తం 20 మంది రోజులు చికిత్స తీసుకుంటున్నట్లు స్థానిక ఎమ్మార్వో తెలిపారు. 

అసుపత్రికి రెవిన్యూ, పోలీసు అధికారులు చేరుకున్నారు. పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటున్నాయి అసుప్రతి వర్గాలు



Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

Posted On 2026-09-01 05:09:26

Readmore >
Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >
Image 1

భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-08-31 16:13:50

Readmore >
Image 1

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-31 16:06:18

Readmore >
Image 1

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

Posted On 2026-08-31 16:04:40

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >
Image 1

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

Posted On 2026-08-31 14:40:45

Readmore >
Image 1

మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు

Posted On 2026-08-31 13:50:27

Readmore >