| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విద్యుత్ షాక్‌తో రైతు దంపతుల దుర్మరణం...

విద్యుత్ షాక్‌తో రైతు దంపతుల దుర్మరణం...

విద్యుత్ షాక్‌తో రైతు దంపతుల దుర్మరణం... గంభీరావుపేటలో విషాదం

డైలీ భారత్, గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన రైతు దంపతులు గంట దేవయ్య (58), గంట లక్ష్మి (52) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

గురువారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లిన వారు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైనట్లు స్థానికులు భావిస్తున్నారు. పొలంలో కోతులు, అడవి పందుల బెడద నివారణకు దేవయ్య పొలం చుట్టూ ఫెన్సింగ్ వైరు ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్ ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అదే వైరు కారణంగా దంపతులు షాక్‌కు గురైనట్లు అనుమానిస్తున్నారు.

అటుగా వెళ్లిన స్థానికులు విగతజీవులుగా పడి ఉన్న దంపతులను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై సీహెచ్. శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Previous నూతన బ్రిడ్జి వాయిదాలు వేయకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి : తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ
Next స్వచ్ఛత హి సేవ-2026లో పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం : సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం
ADVERTISEMENT