| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

స్వచ్ఛత హి సేవ-2026లో పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం : సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

స్వచ్ఛత హి సేవ-2026లో పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం : సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛత హి సేవ-2026 కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరై పారిశుధ్య కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీ కలలుగన్న స్వచ్ఛ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణమవుతుందన్నారు. సిరిసిల్లను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కార్మికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.

కార్మికుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు అశ్విని హాస్పిటల్స్, ఎల్లారెడ్డిపేట సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. అశ్విని హాస్పిటల్స్ ఎండీ, సీఈఓ డాక్టర్ అభినయ్ గోవర్ధనం ఆధ్వర్యంలో కార్డియాక్ నిపుణులు డాక్టర్ పరమేశ్వర రెడ్డి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ మహేష్, పల్మోనాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పాల్గొని కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, సలహాలు, మందులు అందజేశారు.

శిబిరంపై విశ్వసనీయత పెంచేందుకు చైర్‌పర్సన్ స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అశ్విని హాస్పిటల్స్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.

మున్సిపల్ కమిషనర్ ఎం.డి. ఖాదిర్ ఫాషా మాట్లాడుతూ కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వేముల రాములు, దూడం రజిని శ్రీనివాస్, ఎర్రం వెంకట్రాజ్యం, మామిడాల మహేష్, బుర్ర నారాయణ గౌడ్ తదితరులు, కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ సోహెల్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Previous విద్యుత్ షాక్‌తో రైతు దంపతుల దుర్మరణం...
Next ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకానికి CSR సాయం...
ADVERTISEMENT