Posted on 2025-06-16 12:10:10
డైలీ భారత్, భువనగిరి: తమ ప్రేమను పెద్దలు కాదంటరన్న అనుమానంతో ఓ ప్రేమజంట రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. జనగాం జిల్లా జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం నెమలికొండకు చెందిన మచ్చ శృతి(23), కె. వినయ్ కుమార్(25) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఒకరినొకరు ఇష్టపడటంతో కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ మధ్యే వారి ప్రేమ విషయం పెద్దలకు తెలిసింది. అయితే తమ ప్రేమను కాదంటారని, తమ వివాహానికి పెద్దలు అంగీకరించరని వారిద్దరూ అనుమానించారు. దీంతో ఆదివారం అర్థరాత్రి ఇంటినుంచి బయలు దేరి బయటకు వచ్చారు. తమ ప్రేమను కాదంటే విడిపోయి బతకలేమని నిర్ణయించుకున్న వారిద్దరూ భువనగిరి శివారులో రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం వారి శవాలను గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా పంచనామా నిమిత్తం మృతదేహాలను జనరల్ ఆసుపత్రికి తరలించారు.
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >
భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-08-31 16:13:50
Readmore >
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
Posted On 2026-08-31 16:06:18
Readmore >
కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Posted On 2026-08-31 14:42:24
Readmore >
పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు
Posted On 2026-08-31 14:40:45
Readmore >
మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు
Posted On 2026-08-31 13:50:27
Readmore >
వెయ్యి గొంతులు.. ఒక్కటే శబ్దం.. రావులపాలెంలో మార్మోగిన వేమన శతకం
Posted On 2026-08-31 13:49:27
Readmore >