| Daily భారత్
Logo




పెంపుడు కుక్క కరిచి బాలుడు మృతి

News

Posted on 2023-09-06 05:58:35

Share: Share


పెంపుడు కుక్క కరిచి బాలుడు మృతి

ఘజియాబాద్‌: ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో పెంపుడు కుక్క కాటుకు గురై 14 ఏళ్ల బాలుడు మృత్యువాత చెందాడు. బాలుడి కుటుంబ సభ్యులు ఎన్ని ఆసుపత్రులు తిరిగినా బాలుడు బతకలేదు.

చివరికి తండ్రి ఒడిలో అంబులెన్స్‌లోనే బాలుడు ప్రాణాలు విడిచాడు. దీంతో తీవ్ర దు:ఖంతో బాలుడి తండ్రి.. తన కొడుకు చనిపోయాడంటూ కన్నీరుమున్నీరయ్యాడు. అభం శుభం తెలియని తన కొడుకు ఆ కుక్క బలితీసుకుందని.. దాన్ని పెంచుకునే ఇంటి యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.విజయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చరణ్ సింగ్ కాలనీలో యాకూబ్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. యాకూబ్ కూలీ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఉన్నట్టుండి ఎనిమిదో తరగతి చదువుతున్న అతని కుమారుడు చావెజ్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నీళ్లను చూస్తే తెగ భయపడిపోయేవాడు. అంతేకాకుండా ఆ బాలుడు.. తినడం, త్రాగడం కూడా మానేశాడు. కొన్నిసార్లు కుక్క మొరిగినట్లుగా శబ్దాలు చేసేది.

అయితే చావెజ్ పరిస్థితిని చూసిన కుటుంబ సభ్యులు వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా.. కొంతకాలం క్రితం కుక్క కాటుకు గురయ్యాడని గుర్తించారు. కుక్క కాటు వల్ల ఇన్ఫెక్షన్ అతని శరీరమంతా వ్యాపించిందని తెలిపారు. ఆ కారణంగా బాలుడు వింతగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నాడు. ఇదే విషయమై కుటుంబ సభ్యులు చావెజ్‌ను ప్రశ్నించగా.. నెలన్నర క్రితం కుక్క కరిచిందని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు తనను కొడతారనే భయంతో కుక్క కరిచిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.

ఈ విషయాన్ని విన్న కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కుక్క కాటుకు గురయ్యానని చెబితే.. సకాలంలో వైద్యం చేసి ఉండేవాళ్లమని చెప్పారు. దీంతో సెప్టెంబరు 1 నుండి కుటుంబ సభ్యులు బాలుడిని ఇతర వైద్యులకు చూపించారు. ఎక్కడికి వెళ్లినా వైద్యం చేయలేకపోతున్నారు. అయితే కుక్కకాటుకు చికిత్స చేసే ఆయుర్వేద వైద్యుడు ఉన్నారని తెలుసుకుని వెళ్లారు. అక్కడ ఆ వైద్యుడికి చూపెట్టిన తర్వాత.. తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో తండ్రి ఒడిలో బాలుడు చావెజ్‌ చనిపోయాడు. దీంతో తన బిడ్డను అలాంటి పరిస్థితిలో చూసి తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు.

Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >