| Daily భారత్
Logo




"ఆపరేషన్ సింధూర్".... ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు

News

Posted on 2025-05-07 07:55:25

Share: Share


"ఆపరేషన్ సింధూర్".... ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు

డైలీ భారత్, జమ్మూ కాశ్మీర్: ఊహించినట్లే పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ సైన్యం మెరుపుదాడులు చేసింది. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో పాకిస్థాన్‌తోపాటు, పాక్‌ ఆక్రమిత జమ్ముకశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 పాక్‌ ఉగ్రస్థావరాలను టార్గెట్‌ చేసినట్లు సైన్యం ఓ ప్రకటన విడుదలచేసింది. పాకిస్థాన్‌ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని అందులో తెలిపింది.

పహల్గాం బాధితులను చట్టం ముందు నిలబెడతాం

భారతదేశంపై ఉగ్రదాడులకు ప్రణాళికలు వేస్తూ అమలు చేస్తున్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు భారత సైన్యం తెలిపింది. తమ చర్యలు పూర్తిగా కేంద్రీకృతమైనవనీ, కచ్చితత్వంతో తీవ్రతరం కాని విధంగా దాడులు చేసినట్లు భారత సైన్యం వెల్లడించింది. లక్ష్యాల ఎంపిక, దాడుల అమలులో పూర్తి సంయమనం పాటించామని తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి బాధ్యులను చట్టం ముందు నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నామని సైన్యం స్పష్టంచేసింది.

"న్యాయం జరిగింది"

పహల్గాం ఉగ్రదాడికి న్యాయం జరిగిందంటూ సర్వ్‌డ్‌ జస్టిస్‌ అని పోస్టు చేసింది. దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటామనీ, విజయం సాధించేందుకే శిక్షణ పొందామని అర్థం వచ్చేలా ప్రహరాయ్‌ సన్నిహితా, జయాయ్‌ ప్రశిక్షితా అంటూ సంస్కృత వ్యాఖ్యాన్ని జోడించింది.

పాకిస్థాన్‌పై భారత్‌ మెరుపుదాడులు చేయడంతో ఆ దేశం రగిలిపోతోంది. జమ్ముకశ్మీర్‌ పూంచ్‌ రాజౌరీ ప్రాంతంలోని బింబర్‌ గాలీ సరిహద్దు వద్ద కాల్పులవిరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పెద్ద ఎత్తున ఫిరంగులను పేల్చింది. పాకిస్థాన్‌ కవ్వింపులను భారత బలగాలు తిప్పికొట్టాయి. భారత్‌ మెరుపుదాడుల వేళ.. పాకిస్థాన్‌ ప్రతీకార చర్యలకు తెగబడే అవకాశం ఉండటంతో సైన్యం అప్రమత్తమైంది. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లోని అన్ని గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.

భారత్​లో పలు ఏయిర్​పోర్టులు మూసివేత!

అయితే దాడులు ఏయే ప్రాంతాల్లో చేశారనే విషయాన్ని ఇండియన్ ఆర్మీ వెల్లడించలేదు. మరోవైపు, దాడుల నేపథ్యంలో శ్రీనగర్​, జమ్ము, అమృత్​సర్, ధర్మశాల, లేహ్​ విమానాశ్రయాలు భారత్​ మూసివేసినట్లు తెలుస్తోంది.

దాడులపై పాకిస్థాన్ ప్రధాని స్పందన

భారత్​ దాడులు యుద్ధ చర్యలని పాకిస్థాన్​ ప్రధాని షెహబాద్​ షరీఫ్ అన్నారు. మోసపూరిత శత్రువు పాక్​లోని 5 ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ చర్యలకు పాక్​ కచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ సమయంలో పాకిస్థాన్​ సైన్యం వెంట దేశమంతా ఉంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాక్​, ఆర్మీకి తెలుసు. ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయం" అని ఎక్స్‌లో అన్నారు.

దాడులు ధ్రువీకరించిన భారత్

పాకిస్థాన్​లోని ఉగ్ర స్థావరాలపై చేసిన దాడులను ఆ దేశం ధ్రువీకరించింది. దీనిపై పాక్ డీజీ ఐఎస్‌పీఆర్‌ లెప్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌదరీ కూడా ఈ ఘటనపై స్పందించారు. పాకిస్థాన్​లోని కొట్లీ, మురిడ్కే, బహవల్పూర్‌, ముజఫరాబాద్‌ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోయారని, 12 మందికి గాయాలైనట్టు పాక్‌ ఆర్మీ తెలిపింది. సమయం చూసుకొని బదులుగా స్పందిస్తామని చెప్పారు. భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని ప్రగల్బాలు పలికారు.

బార్డర్​లో టెన్షన్ టెన్షన్!

పాకిస్థాన్ ప్రధాని ప్రకటన తర్వాత ఎల్​ఓసీ వెంబడి ఫూంచ్​, రాజౌరి సెక్టార్లలో పాక్​ ఆర్మీ కాల్పులకు తెగబడిందిత. దీంతో భారత్​ సైన్యం కూడా దీటుగా కాల్పులు ప్రారంభించింది. దీంతో సరిహద్దుల్లో ఉద్రక్త వాతావరణం నెలకొంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిడ్కే టెర్రరిస్టు గ్రూప్ లష్కరే తోయిబాకు కేంద్రంగా ఉంది. ఇక పాక్ పంజాబ్​ ప్రావిన్స్​లోని బహవల్పూర్​లో మసూద్​ అజార్ నేతృత్వంలోని జైష్​-ఎ- మహ్మద్ హెడ్​ క్వార్టర్స్​ ఉంది.

Image 1

సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గంగారాజు

Posted On 2025-12-09 12:48:45

Readmore >
Image 1

దేవాలయంలో ఈ ఐదు వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది

Posted On 2025-12-09 11:26:29

Readmore >
Image 1

రిజిష్టర్ కాని భూమి కొనుగోలు - పట్టా పాసుపుస్తకం పొందాలంటే?

Posted On 2025-12-09 11:22:22

Readmore >
Image 1

సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియాతో ముందుకు పోతున్న అభ్యర్ధులు

Posted On 2025-12-09 11:21:25

Readmore >
Image 1

నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు

Posted On 2025-12-09 08:11:59

Readmore >
Image 1

2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

Posted On 2025-12-08 19:32:03

Readmore >
Image 1

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు

Posted On 2025-12-08 18:21:39

Readmore >
Image 1

ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

Posted On 2025-12-08 14:07:07

Readmore >
Image 1

రియల్టర్ దారుణ హత్య

Posted On 2025-12-08 13:49:01

Readmore >
Image 1

అన్ని దేవుళ్ళపై ఒట్టేసి మాట తప్పిన ప్రభుత్వం కాంగ్రెస్

Posted On 2025-12-08 13:38:14

Readmore >