| Daily భారత్
Logo




ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి వాఖ్యలు ఆక్షేపనీయం : TPTF జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి

News

Posted on 2025-05-06 16:41:20

Share: Share


ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి వాఖ్యలు ఆక్షేపనీయం : TPTF జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి

ఉద్యోగులు తెలంగాణ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి వ్యతిరేకం కాదు

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ( TPTF) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవత్‌ రెడ్డి నిన్న మీడియాలో తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచేలా, తెలంగాణ ప్రజలను ఢిల్లీలో దొంగలుగా చూస్తున్నారని, ఉద్యోగులు ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే విధంగా వాఖ్యలు చేయడాన్ని టీపీటీఎఫ్‌ తీవ్రంగా ఖండిస్తున్నది. ఉద్యోగులు తెలంగాణ అభివృద్ధికి, సంక్షేమానికి వ్యతిరేకం కాదు. ప్రజలు పాలకులకు అధికారాన్ని అప్పగించింది ప్రజలందరీ బాగోగుల కోసమే. ఉద్యోగులు కూడా ప్రజలలో భాగమేననే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఉద్యోగులు జి.పి.ఎఫ్‌, టిఎస్‌జిఎల్‌ఐ  (tsgli)లలో తాము దాచిపెట్టుకున్న సొమ్మును ప్రభుత్వం తిరిగి ఇవ్వకుండా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంచడం మరియు 30 ఏళ్ళకు పైగా  ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వానికి సేవలు అందించి రిటైర్డ్‌ అయిన పెన్షనరీ ప్రయోజనాలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తే ప్రభుత్వం ఉద్యోగులు బోనస్‌ ఇవ్వాలని ఉద్యమాలు చేస్తున్నారని ప్రజలను, సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ముఖ్యమంత్రి అసత్యాలను మాట్లాడడం శోచనీయం అని అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి అన్నారు..

ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ ప్రోగ్రాం టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశంలో  దుమాల రమానాధ్ రెడ్డి  మాట్లాడుతూ

ఎన్నికల సందర్భంగా కాంగ్రేస్‌ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీలనే డిమాండ్లుగా చేసుకొని నేడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమిస్తున్నవి. ప్రభుత్వం గత పదిహేను నెలలుగా అనేక మార్లు ఉద్యోగ జె.ఎ.సి.తో చర్చలు జరిపి పరిష్కరిస్తామని చెప్పి నేడు ఉద్యోగులకు మొండి చెయి చూపెడుతూ వంచిస్తున్నది. ఉద్యోగ జె.ఎ.సి. ప్రభుత్వం ముందు పెట్టిన 57 డిమాండ్లలో సుమారు 40 డిమాండ్లు ఆర్థికేతరమైనవే. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వేసిన మంత్రుల ఉప కమిటీ అనేది పేరుకే మిగిలిపోయింది. రాష్ట్రం ఆర్థికంగా దివాళ తీయడానికి ప్రభుత్వ పాలకులే బాధ్యత వహించాలి. పాలకులు అడ్వర్‌టైస్‌మెంట్‌ల పేర్ల మీద, హెలికాఫ్టర్ల ప్రయాణాల మీద పెడుతున్న అడ్డగోలు ఖర్చులను తగ్గించి ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచకుండా సామాన్య, మధ్యతరగతి ఉద్యోగుల హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం సరైనది కాదు.

ఉద్యోగులను బెధిరించి, ప్రజలకు ఉద్యోగులకు మధ్య చిచ్చుపెట్టి బాధ్యతల నుండి తప్పించుకొనే ప్రయత్నంలో భాగంగానే ముఖ్యమంత్రి గారు ఉద్యోగులపై అసంబద్ధ వాఖ్యలు చేశారు. ఉద్యోగులుగా న్యాయపరంగా రావాల్సిన హక్కుల కోసం నిరంతరం పోరాడుతాము. అదేవిధంగా ప్రజల సంక్షేమానికి, హక్కులకై నిలబడతామని టీపీటీఎఫ్‌ (TPTF ) తెలుపుతున్నది అని వారు అన్నారు..

ఈ సమావేశంలో TPTF రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య, రాష్ట్ర కౌన్సిలర్ సత్తు రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు హనుమాన్లు దబ్బెడ, మందాడి శ్రీనివాసరెడ్డి, నూగురి దేవేందర్, జిల్లా కార్యదర్శిలు మైలారం తిరుపతి, వేములవాడ అర్బన్ మండల అధ్యక్షులు బొజ్జ కృష్ణ , వేములవాడ రూరల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి దూస సంతోష్, తంగళ్ళపల్లి మండల ప్రధాన కార్యదర్శి మధుసూదన్ జిల్లా కౌన్సిలర్ చకినాల భాస్కర్లు పాల్గొన్నారు

Image 1

సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గంగారాజు

Posted On 2025-12-09 12:48:45

Readmore >
Image 1

దేవాలయంలో ఈ ఐదు వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది

Posted On 2025-12-09 11:26:29

Readmore >
Image 1

రిజిష్టర్ కాని భూమి కొనుగోలు - పట్టా పాసుపుస్తకం పొందాలంటే?

Posted On 2025-12-09 11:22:22

Readmore >
Image 1

సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియాతో ముందుకు పోతున్న అభ్యర్ధులు

Posted On 2025-12-09 11:21:25

Readmore >
Image 1

నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు

Posted On 2025-12-09 08:11:59

Readmore >
Image 1

2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

Posted On 2025-12-08 19:32:03

Readmore >
Image 1

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు

Posted On 2025-12-08 18:21:39

Readmore >
Image 1

ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

Posted On 2025-12-08 14:07:07

Readmore >
Image 1

రియల్టర్ దారుణ హత్య

Posted On 2025-12-08 13:49:01

Readmore >
Image 1

అన్ని దేవుళ్ళపై ఒట్టేసి మాట తప్పిన ప్రభుత్వం కాంగ్రెస్

Posted On 2025-12-08 13:38:14

Readmore >