| Daily భారత్
Logo




జూలూరుపాడు బిజెపి మండల అధ్యక్షునిగా గిరిజనుడికి పట్టాభిషేకం

News

Posted on 2025-05-04 16:36:31

Share: Share


జూలూరుపాడు బిజెపి మండల అధ్యక్షునిగా గిరిజనుడికి పట్టాభిషేకం

డైలీ భారత్, ఖమ్మం న్యూస్: ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండల అధ్యక్షునిగా ఎస్టీ సమాజ వర్గానికి చెందిన భూక్య రమేష్ ను నియమిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు తెలియచేశారు.

సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఎప్పుడూ ముందుంటారని, భూక్య రమేష్ ను భారతీయ జనతా పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షులుగా నియమించి సంచలనానికి తెర తీశారని, ఒక గిరిజనుడికి మండలాధ్యక్షుడుగా బాధ్యతలు అప్పగించి తనను తాను నిరూపించుకునే అవకాశం భూక్య రమేష్ కి కల్పించారని, జిల్లా అధ్యక్షులు నిర్ణయాన్ని మండలంలోని  కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారని ఈ సందర్భంగా పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు.

కష్టపడి పనిచేసే వారిని గుర్తించడంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ముందే ఉంటుందని,దానికి తగ్గట్లే ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు నిర్ణయాలు ఉంటాయని, భూక్యా రమేష్ నియామకమే ఇందుకు నిదర్శనమని తెలంగాణా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ కొనియాడారు. ఈ సందర్భంగా అన్నవరపు సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు కి ధన్యవాదాలు తెలియజేశారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >