Posted on 2025-04-26 04:16:35
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణలు రావడంతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై లక్ష్మీనారాయణపై గత కొంతకాలంగా పలు అవినీతి ఆరోపణలున్నాయి.
తాజాగా, ఓ మహిళకు సంబంధించిన కేసు విషయంలో ఆయన ముగ్గురు వ్యక్తులను అకారణంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితులు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన సీపీ, ప్రాథమిక విచారణ అనంతరం ఎస్సై లక్ష్మీనారాయణను తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సీపీ కార్యాలయం తెలిపింది. పోలీస్ శాఖలో అవినీతిని సహించేది లేదని, చట్టాన్ని అతిక్రమించే ఏ అధికారిపై అయినా కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >