| Daily భారత్
Logo




అమెరికాలో వీసా రద్దయిన విద్యార్థుల్లో 50% మంది భారతీయులే!

News

Posted on 2025-04-19 10:46:05

Share: Share


అమెరికాలో వీసా రద్దయిన విద్యార్థుల్లో 50% మంది భారతీయులే!

డైలీ భారత్, హైదరాబాద్: అమెరికాలో వీసాల రద్దు,స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ రికార్డుల నుంచి తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈ తొలగింపులకు గురైన అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది భారతీయులేనని ఏఐఎల్‌ఏ చెప్పింది.

ఇటీవల అమెరికాలో వీసాల రద్దు లేదా స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(సెవీస్‌) రికార్డుల నుంచి తొలగింపునకు గురైన అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది భారతీయులేనని అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. ఇందుకు సంబంధించి విద్యార్థులు, న్యాయవాదులు, యూనివర్సిటీ ఉద్యోగుల నుంచి 327 కేసు నివేదికలను ఈ సంఘం సేకరించింది. ఈ అంతర్జాతీయ విద్యార్థులలో సగం మంది భారతదేశానికి చెందిన వారు కాగా 14 శాతం మంది చైనా విద్యార్థులని ఏఐఎల్‌ఏ ప్రకటించింది. మిగిలిన విద్యార్థులు ప్రధానంగా దక్షిణ కొరియా, నేపాల్‌, బంగ్లాదేశ్‌కు చెందిన వారని గురువారం వెల్లడించింది.

2023-24లో అమెరికాలో చేరిన అంతర్జాతీయ విద్యార్థులలో అత్యధికులు భారతీయులేనని, మొత్తం 11,26,690 మంది అంతర్జాతీయ విద్యార్థులలో 3,31, 602 మంది (29 శాతం) భారతీయులేనని ఓపెన్‌ డోర్స్‌ డాటా పేర్కొంది. వీరి తర్వాత 2.77 లక్షల మందితో చైనా ద్వితీయ స్థానంలో నిలిచింది. వీరిలో 50 శాతం మంది విద్యార్థులు ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)లో ఉన్నారని, అంటే వీరంతా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారని ఏఐఎల్‌ఏ తెలిపింది. 

ఎఫ్‌-1 వీసాపై అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులు 12 నెలలు పని చేసుకోవచ్చు. అదే స్టెమ్‌ కోర్సుల విద్యార్థులైతే మరో 24 నెలలు తమ వీసాను పొడిగించుకోవచ్చు. సెవీస్‌ రికార్డు నుంచి తొలగింపునకు గురైన ఓపీటీ విద్యార్థులు వెంటనే ఉద్యోగాలు చేసేందుకు వీల్లేదని, ప్రస్తుతం చదివే విద్యార్థులతో పోలిస్తే ఓపీటీ కింద ఉద్యోగాలు చేస్తున్న వారు తమ పాత హోదా పొందడం సాధ్యం కాదని ఏఐఎల్‌ఏ తెలిపింది. 2023-24లో 3.32 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉండగా వీరిలో 97,566 మంది విద్యార్థులు ఓపీటీలో ఉన్నారని ఏఐఎల్‌ఏ వివరించింది.

అంతర్జాతీయ విద్యార్థుల వీసాల రద్దు ఏకపక్షంగా జరుగుతున్నట్లు ఏఐఎల్‌ఏ ఆందోళన వ్యక్తం చేసింది. తాము సేకరించిన కేసుల నివేదికలలో 86 శాతం కేసులు ఏదో ఒక స్థాయిలో పోలీసులతో సంప్రదింపులకు నోచుకున్నాయని, 33 శాతం వీసాలు రద్దయిన కేసులలో అభియోగాలు నమోదు చేయకపోవడం, వారిపై కేసులు పెట్టడం లేదని ప్రకటన తెలిపింది.

గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన జోన్‌లో 70 కిలోమీటర్ల వేగంతోడ్రైవ్‌ చేయడం, చట్టవిరుద్ధంగా వాహనం పార్కింగ్‌ చేయడం, సీటు బెల్టు ధరించకపోవడం, నెంబర్‌ ప్లేట్లు గడువు తీరిపోవడం వంటి చిన్న చిన్న అభియోగాలతో పోలీసుల నుంచి ఓపీటీ విద్యార్థులకు నోటీసులు అందాయి. వీసా రద్దుకు గురైన విద్యార్థులలో ఇద్దరు విద్యార్థులకు మాత్రమే రాజకీయ నిరసనలలో పాల్గొన్న చరిత్ర లేదని ఏఐఎల్‌ఏ తెలిపింది. వీసా రద్దుకు సంబంధించిన ఈమెయిర్‌ నోటీసులు అందుకున్న మెజారిటీ విద్యార్థులకు ఈ నోటీసు వీసాను మంజూరు చేసిన కాన్సులేట్‌ నుంచి వచ్చినట్లు ఏఐఎల్‌ఏ పేర్కొంది. 

కాగా, అమెరికాలో వీసాలు రద్దయిన భారతీయ విద్యార్థుల గురించి విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ను గురువారం విలేకరులు ప్రశ్నించగా చాలామంది భారతీయ విద్యార్థులకు నోటీసులు అందిన విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >
Image 1

ప్రియుడి దారుణ హత్య.. సుత్తితో బాది, గొంతు కోసిన వివాహిత

Posted On 2026-04-18 14:46:08

Readmore >
Image 1

"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి

Posted On 2026-04-18 13:51:32

Readmore >