Posted on 2025-04-02 09:46:54
అధికార విపక్షాల బలాలేంటి?
డైలీ భారత్ న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా తీవ్ర చర్చనీ యాంశంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లు ఇవ్వాళ పార్లమెంటు ముందుకు రానుంది. మొదట లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును పెట్టి చర్చించ నున్నారు.
ఆ తర్వాత ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపె ట్టేందుకు అధికార ఎన్డీఏ కూటమి సిద్ధం అయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కూటమి పార్టీల ఎంపీలకు విప్ జారీ చేసింది. 3 రోజు ల పాటు అందరు ఎంపీలు తప్పకుండా సభకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చిం ది. మరోవైపు.. ఈ వక్ఫ్ సవరణ బిల్లును ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యతిరేకిస్తోంది.
ఈ క్రమంలోనే ఇండియా కూటమిలోని పార్టీలు.. ఈ బిల్లును అడ్డుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అటు.. ఇండియా కూటమి పార్టీలు కూడా తమ ఎంపీలు తప్పక సభకు రావాలని ఆదేశాలు జారీ చేశాయి. ఇక లోక్‌సభ, రాజ్యసభల్లో ఎన్డీఏ కూటమికి సరిపడా బలం ఉండటంతో.. ఏదైనా జరిగితే తప్ప ఈ బిల్లు ఆమోదం పొందడం తథ్యంగా కనిపిస్తోంది.
బుధవారం మధ్యాహ్నం లోక్‌సభలో ఈ వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటు ముందు రానున్న నేపథ్యం లో తమ తమ ఎంపీలు సభకు కచ్చితంగా హాజరు కావాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విప్‌లు జారీ చేశాయి.
బుధవారం నుంచి 3 రోజుల పాటు సభలకు కచ్చితంగా రావాలని తమ ఎంపీలను ఆదేశించాయి. ప్రస్తుతం అటు లోక్‌సభ ఇటు రాజ్యసభల్లో అధికార ఎన్డీఏ కూటమికి ఫుల్ మెజారిటీ ఉంది.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >