డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్ నందు టియుడబ్ల్యూజె( ఐజెయు) నేషనల్ కౌన్సిల్ మెంబర్ సీనియర్ పాత్రికేయులు దుద్దుకూరి రామారావు ఆధ్వర్యంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఇమంది ఉదయ్ కుమార్ టియుడబ్ల్యూజె( ఐజెయు) సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న ఇళ్ల స్థలాలు మరియు జర్నలిస్టుల సమస్యలపై పరిణామాలపై చర్చించడం జరిగింది. అనంతరం అందరం కలిసి సమిష్టి నిర్ణయంతో ముందుకు సాగాలని జర్నలిస్టుల ఇంటి స్థలాలు, తదితర సమస్యలపై పోరాటం చేసేందుకు తీర్మానం చేసుకోవడం జరిగింది.
కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారితో మాట్లాడిన అనంతరం కార్యాచరణకు సిద్ధం కావాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజె ( ఐజెయు) యూనియన్ జాతీయ నాయకులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, సీనియర్ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యులు పాల్గొన్నారు.