| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకొని నిర్లక్ష్యంగా ఆటో నడిపిన డ్రైవర్ కి 2000/- రూపాయల జరిమానా

పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకొని నిర్లక్ష్యంగా ఆటో నడిపిన డ్రైవర్ కి 2000/- రూపాయల జరిమానా

డైలీ భారత్, ముస్తాబాద్: పరిమితికి మించి పాఠశాల విద్యార్థులను ఆటోలో ఎక్కించుకుని నిర్లక్ష్యంగా ఆటో నడిపిన గూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్  కొమిరె అభిషేక్ కు 2000/- రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల మొదటి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ మంగళవారం రోజున తీర్పు వెల్లడించినట్లు బుధవారం  ముస్తాబద్ ఎస్.ఐ గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

తేది.07.08.2024 రోజున బ్లూ కోల్ట్  కానిస్టేబుల్ ఖాసిం పెట్రోలింగ్ లో భాగంగా నామపూర్ గ్రామం x రోడ్డు వద్దకు వచ్చెసరికి అతివేగంగా, నిర్లక్ష్యంగా గూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్  కొమిరె అభిషేక్ అనే వ్యక్తి ఆటోలో పరిమితికి మించి (16 మంది విద్యార్థులు) ఎక్కించుకుని నడపడం వల్ల పాఠశాల పిల్లల ప్రాణాలకు హాని కలిగే ప్రమాదం ఉన్నదని ఆటో నడిపిన వ్యక్తి పై ,చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేయగా ముస్తాబద్ ఎస్సై గణేష్ కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేయగా  కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ప్రవీణ్ ఆటో డ్రైవర్ కి 2000/- రూపాయల జరిమానా విధించినట్లు ముస్తాబద్ ఎస్.ఐ గణేష్  తెలిపారు.

పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకుంటే చట్టప్రకారం చర్యలు.

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను,విద్యార్థులను  ఎక్కించుకోవద్దని, పరిమితి మించి ఎక్కించుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ముస్తాబద్ ఎస్.ఐ తెలిపారు.

Previous వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకే జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం
Next సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగుదాం
ADVERTISEMENT