డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రెండు దొంగతనం కేసులలో నింధితునికి 03 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు ఒక్కొక్క కేసులలో 10,000/-రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ సిరిసిల్ల మొదటి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ సోమవారం తీర్పువెల్లడించినట్లు సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు.
వివరాల మేరకు.. తేదీ 21-01-2017 రోజున సిరిసిల్ల మండలం పెద్దూర్ గ్రామంలోని ఒక ఇంట్లో దొంగతనం తులం బంగారు మరియు 15 తులాల పట్టగొలుసులు దొంగతనం ఆయినది అని ఇంటి యజమాని మేకల లింగమయ్య అనునతడు మరియు పోచమ్మ వీధిలో వున్న అయ్యప్పు ఎజన్సీస్ నందు తేదీ 06-07-2017 నాడు యధావిదిగా ఉ.10 గంటలకు పాపు తీసి సాయంత్రం ప్రతి రోజు లాగానే సాయంత్రం 6:00 గం.లకు షాపు మూసివేసి వెళ్ళినాము. తేది 07-07-2017 రోజున ఉదయం 10 గంటలకు పాపు షెటర్ తెరిచి చుడగా సామానులు, కంపెనీ బిల్లులు అన్నీ చిందరా వందరగా పడి వున్నాయి. వెనుక వైపు చూడగా దర్వాజ తలుపు గొల్లెo విరిగిపోయిు వున్నని మాకు అనుమానం వచ్చి క్యాష్ కౌంటర్ తీసి చూడగా అందులో వున్నటువంటి 18 వెండి కాయిన్స్ మరియు 6 వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్స్ మొత్తం విలువ 7,000 రూ"లు వరకు వుంటుంది అని మద్ది శ్రీనివాస్ అనే వ్యక్తి సిరిసిల్ల పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఏఏస్ ఐ రామచంద్రం కేసు నమోదు చేసిన అనంతరం దర్యాప్తు అధికారి ఎస్.ఐ శేఖర్ దర్యాప్తు చేసి దొంగతనం చేసిన ఎల్లారెడ్డిపెట మండలం వెంకటాపూర్ గ్రామంకి చెందిన గొట్టే అంజయ్య తండ్రి సీతారాం అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అనంతరం ఎస్సై శేఖర్ కోర్టులో చార్జిషీటు దాఖలు చేయగా ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెలిమల సందీప్ వాదించగా సి.ఎం.ఎస్. ఆర్.ఎస్.ఐ. శ్రావణ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ సాక్షులను కోర్టులో ప్రవేశ పెట్టగా కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ప్రవీణ్ గారు నిందితుడికి రెండు కేసులలో మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు పది పది వెయ్యుల 20,000/- రూపాయల జరిమానా విధించినట్లు సిరిసిల్ల సీఐ కె.కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.