Posted on 2025-03-24 14:03:16
షాప్ ప్రారంభోత్సవానికని పిలిచి వ్యభిచారం చేయాలని ఒత్తిడి.
నటి కి ఫోన్ చేసి షాప్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించిన స్నేహితురాలు
18న హైదరాబాద్‌కు చేరుకుని మాసబ్ ట్యాంక్‌లో ని ఓ అపార్ట్‌మెంట్‌లో బస చేసిన నటి
ఇద్దరు మహిళలు వచ్చి తమతోపాటు వ్యభిచారం చేయాలని ఒత్తిడి
ఆ తర్వాత ముగ్గురు వ్యక్తులు తమతో గడపాలని డిమాండ్
గదిలో బంధించిన నటిని విడిపించిన పోలీసులు
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లో బాలీవుడ్ నటిపై దాడి జరిగింది. షాప్ ప్రారంభోత్సవం కోసమని పిలిచి వ్యభిచారం చేయాలని బలవంతం చేయడంతో సదరు నటి నిరాకరించింది. దీంతో నిందితులు దాడికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ముంబైలో ఉంటున్న బాలీవుడ్/టీవీ నటికి ఈ నెల 17న హైదరాబాద్‌కు చెందిన స్నేహితురాలు ఫోన్ చేసింది. ఇక్కడ ఓ షాప్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించింది. విమాన చార్జీలు, పారితోషికం ఇస్తారని చెప్పింది. దీంతో ఆమె ఈ నెల 18న హైదరాబాద్ చేరుకుంది. మాసబ్‌ట్యాంక్ శ్యామ్‌నగర్ కాలనీలోని అపార్ట్‌మెంట్‌లో ఆమెకు బస ఏర్పాటు చేశారు. అక్కడామెకు ఓ వృద్ధురాలు అవసరమైన వసతులు ఏర్పాటు చేసింది.
ఈ నెల 21న రాత్రి 9 గంటలకు ఇద్దరు మహిళలు అపార్ట్‌మెంట్‌కు వచ్చి తమతో కలిసి వ్యభిచారం చేయాలని నటిపై ఒత్తిడి తెచ్చారు. అదే రోజు రాత్రి 11 గంటలకు ముగ్గురు పురుషులు నటి ఉన్న గదిలోకి ప్రవేశించి తమతో గడపాలని ఒత్తిడి చేశారు. అందుకామె నిరాకరించడంతో దాడి చేశారు. దీంతో ఆమె గట్టిగా అరిచి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పగానే వారు అక్కడి నుంచి పారిపోయారు.
ఆ వెంటనే ఇద్దరు మహిళలు, వృద్ధురాలు నటిని గదిలో బంధించి రూ. 50 వేల నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధిత నటి వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని విడిపించారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >