Posted on 2025-03-20 22:41:35
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సన్మానం
డైలీ భారత్, తెలంగాణ డెస్క్: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడం అభినందనీయమని కాంగ్రెస్ నేత గాలి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా.. కాంగ్రెస్ సర్కారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నదని అభినందించారు. అన్ని రాజకీయపార్టీలు అనివార్యంగా బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయడంతోపాటు బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా ఆమోదించిందని చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు. ఆయనకు శాలువా కప్పి అభినందించారు. అనంతరం గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. యావత్ తెలంగాణ బీసీ ప్రజల తరపున తెలంగాణ ప్రభుత్వానికి తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ జనాభా లెక్క పక్కాగా తేల్చి విద్య, ఉద్యోగ,స్థానిక సంస్థల్లో బీసీ కులాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిందని చెప్పుకొచ్చారు. ఆ కోటాకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బిల్లును ఆమోదించిన నేపథ్యంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.
రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు
Posted On 2026-06-25 21:51:45
Readmore >
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్
Posted On 2026-06-25 18:57:28
Readmore >
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి
Posted On 2026-06-25 18:35:11
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-06-25 18:33:22
Readmore >
ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-25 18:23:12
Readmore >
ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి
Posted On 2026-06-25 18:21:26
Readmore >