Posted on 2025-03-20 09:10:44
ప్రభుత్వడిగ్రీ కళాశాల అటానమస్ , పాల్వంచ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ అటానమస్ హిందీ విభాగం విద్యార్థులు ఆకాశవాణి కొత్తగూడెం యువ వాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్.కె రేష్మ థర్డ్ బీకాం మహిళల హక్కులు,చట్టాలు అనే అంశంపై మాట్లాడుతూ, మహిళల హక్కులను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా సమాజంలో లింగ సమానత్వాన్ని కాపాడవచ్చునని, మహిళలు తమ హక్కులను తెలుసుకోవడం ద్వారా శక్తివంతమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చునని తెలియజేసినారు. అనంతరం ఎస్ లావణ్య థర్డ్ బి జెడ్ సి హిందీ మహిళా సాహిత్యకారులు అనే అంశంపై మాట్లాడుతూ మహిళా రచయితలు సమాజంలోని మహిళల వివిధ సమస్యలను, జీవితాలను, భావోద్వేగాలను తమ రచనల ద్వారా తెలియజేసి మహిళలను చైతన్యవంతులను చేసినారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషిచేసిన హిందీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టి అరుణ కుమారి, సహనాజ్ లను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి పద్మ మరియు ఇతర అధ్యాపక బృందం అభినందించినారు.
రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు
Posted On 2026-06-25 21:51:45
Readmore >
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్
Posted On 2026-06-25 18:57:28
Readmore >
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి
Posted On 2026-06-25 18:35:11
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-06-25 18:33:22
Readmore >
ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-25 18:23:12
Readmore >
ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి
Posted On 2026-06-25 18:21:26
Readmore >