| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాలేరియా, పైలేరియా నిర్ములన బృందం పర్యటన

మాలేరియా, పైలేరియా నిర్ములన బృందం పర్యటన

డైలీ భారత్, చర్ల: చర్ల మండలం లో అసిస్టెంట్ డైరెక్టర్ నాగయ్య  (మలేరియా, ఫైలేరియా) వారి బృందంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గన్నవరం కాలని గ్రామం లో  మలేరియా  కేసు   సందర్శనకు రావడం జరిగినది. ముందుగా  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చర్ల నందు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ తో కలిసి రక్త పరీక్షలు చేయు పరీక్షా కేంద్రంను పరిశీలించి వివిధ రకాల రికార్డ్స్ ను చూసి తగు సూచనలు చేయడం జరిగినది. తదనంతరం గన్నవరం కాలనీ గ్రామం  ను సందర్శించి అక్కడ నమోదయినటువంటిమలేరియా కేసు ఇంటిని ప్రత్యేకంగా సందర్శించి వారియొక్క ఆరోగ్యంనూ ఆరాధిసి వారికి కీటక జనిత వ్యాధులపై ఆరోగ్య అవగాహన కల్పించినారు. ప్రతి వ్యక్తి   ఇంట్లో దోమతెరలను వాడాలని , ప్రతి మంగళవారం,శుక్రవారం నాడు ఇంటిలోపల వాడు పాత్రలను(తొట్లు, డ్రమ్ములు) వంటి వాటిని శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వ గుంటలు లేకుండ చూసుకోవాలని  గ్రామస్తులకు తెలిపినారు. పీల్దు నందు పనిచేయు ( ఏం పి హాచ్ ఏ ఎం,ఎఫ్ ) వారు సంబంధిత అన్నీ రికార్డ్స్ పెట్టి వాటి నందు తగిన కేసుల సమాచారం పొందుపర్చుకుని ఎప్పటికప్పుడు గృహ సందర్శనకు చేసి వారికి ఆరోగ్య విద్యను అందించవలేనని తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో మెడిడికల్ ఆఫీసర్ లు డాక్టర్ శ్రీధర్, డాక్టర్ హరిక , అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ కుమారస్వామి   ,  సబ్ యూనిట్ అధికారి  ధర్మారావు,హెల్త్ సూపర్వైజర్ రాం ప్రసాద్,ల్యాబ్ ల్యాబ్ టెక్నీషియన్ మొరలి ,యం టీ ఎస్  రామకృష్ణ, హెల్త్ అసిస్టెంట్ ధర్మారావు, గ్రామాల ఆషా కార్యకర్త ఇందుమతి పాల్గొన్నారు.

Previous అన్నారం గ్రామంలోని కన్వర్టెడ్ క్రైస్తవులకు SC సర్టిఫికేట్లు రద్దు చెయ్యాలి
Next ఆకాశవాణి కొత్తగూడెం యువ వాణి కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు
ADVERTISEMENT