| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నిరుద్యోగ మహిళలు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

నిరుద్యోగ మహిళలు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల మండల కేంద్రంలోని కే.జి.ఆర్ ఫంక్షన్ హాల్ లో మల్టీ నేషనల్ కంపెనీ నిర్వహించిన మెగా జాబ్ మేళా (మహిళల) కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యతో కలిసి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు...


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన ఎం.ఎన్.సి కొంగరకలన్,తుక్కుగూడ, ఇండస్ట్రియల్ పార్క్ లో పనిచేసేందుకు టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అండ్ ఫెయిల్ అయిన మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నారు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఆర్ డి ఓ చంద్రకళ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు షాబాద్ దర్శన్,కలే శ్రీకాంత్, దేవర అగిరెడ్డి,దేవర వెంకట్ రెడ్డి,ప్రతాప్ రెడ్డి,చంద్రశేఖర్ ముదిరాజ్, అధికారులు,మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తలు, కంపెనీ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Previous కొత్తూరు అయ్యప్ప స్వామి ఆలయానికి 51,000 విరాళం అందజేసిన అందే బాబయ్య
Next విద్యార్థి మృతి పై విచారణ జరిపించాలి : లక్ష్మణ్ కుమార్
ADVERTISEMENT