| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విద్యార్థి మృతి పై విచారణ జరిపించాలి : లక్ష్మణ్ కుమార్

విద్యార్థి మృతి పై విచారణ జరిపించాలి : లక్ష్మణ్ కుమార్

కళాశాల ముందు ధర్నా,నిరసనకు దిగిన యువసత్తా యూత్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : నందిగామ మండల పరిధిలోని ఇంటర్నేషనల్ సింబయాసిస్ యూనివర్సిటీ లో నిన్న రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన లా చదువుతున్న షగ్నిక్ బాసు మృతి పై సమగ్ర విచారణ జరిపించి,సరైనా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాలలో మెయిన్ గేట్ ఎదుట నిరసన,ధర్నాకు దిగారు రంగారెడ్డి జిల్లా యువసత్తా యూత్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్.ఈ సందర్బంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,,కళాశాలలో క్రమశిక్షణ చర్యలను పెపొందించాలని ఆందోళన కార్యక్రమం చేపట్టారు.విద్యార్థి మృతికి యాజమాన్యం నిర్లక్ష్యమా లేక ఇంకా ఏదైనా ఉన్నదా అంటే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు.విద్యార్థి కి న్యాయం జరగకపోతే కళాశాల ఎదుటి విద్యార్థి సంఘాలతో కలిసి ధర్నా నిర్వహించడం జరుగుతుందని హెచ్చరించారు.ఈ నిరసన,ధర్నాలో గ్రామ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

Previous నిరుద్యోగ మహిళలు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Next జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి ఘోర అవమానం
ADVERTISEMENT