| Daily భారత్
Logo




క్షుద్ర రాజకీయాలపై రుద్రనేత్రుడై లేచిన చత్రపతి : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2025-02-23 06:17:58

Share: Share


క్షుద్ర రాజకీయాలపై రుద్రనేత్రుడై లేచిన చత్రపతి : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

చత్రపతి చరిత్రపై కూడా కొందరి కుట్రలు

చర్ల అంతిరెడ్డి గూడలో ఛత్రపతి వీర శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఆనాటి క్షుద్ర రాజకీయాలపై రుద్రనేత్రుడే లేచి భరతమాత నుదుటిపైన నెత్తుటి తిలకం దిద్దిన మహనీయుడుగా చరిత్రకెక్కిన పోరాట వీరుడు చత్రపతి వీర శివాజీ యువతకు ఆదర్శంగా నిలుస్తారని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం చెర్ల అంతిరెడ్డిగూడ గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం ఈ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రసంగిస్తూ.. చత్రపతి శివాజీ నాటి రాజకీయాలపై ఒంటరిగానే దండెత్తి విజయం సాధించిన మహనీయుడు, సార్వభౌముడు అని కొనియాడారు. ఒక లక్ష్యం కోసం సామాజిక తత్వం కోసం పోరాటం చేసిన ఛత్రపతి శివాజీ చరిత్రను కూడా కొన్ని రాజకీయ పార్టీలు దుష్టశక్తులు తమకు అనుకూలంగా రాజకీయ స్వార్థం కోసం ఆయన పేరును మలుచుకుంటున్నారని యువతకు సూచించారు. హిందూ ధర్మ వాదిగా చత్రపతి ప్రస్థానం అన్ని వర్గాలను ప్రేమించారని, గౌరవించారని చరిత్రలో అందరికీ ఆయన సమన్యాయం చేసిన చరిత్ర ఉందని, ఏ వర్గాన్ని ఆయన కించపరచలేదని, ఆత్మగౌరవం కోసం చత్రపతికి జరిగిన అవమానం కోసం ఆయన ఆనాటి రాజులపై దండెత్తి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారని అయితే కొన్ని మతతత్వ పార్టీలు కుట్రలు చేస్తూ ఆయనను ఒక వర్గానికి అంటగడుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. చత్రపతి శివాజీ అందరివాడని ఆయన ఆలోచనలు, ఆశయాలు మానవాళికి అందరికీ ఉపయోగమని శంకర్ అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో అంగరంగ వైభవంగా వీర శివాజీ ఆవిష్కరణ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు. ఎమ్మెల్యే శంకర్ ను గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున ఘనంగా సన్మానించారు..

Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >