Posted on 2025-02-07 03:52:18
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహణ
డైలీ భారత్ ,ఖమ్మం:ఖమ్మం జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను అందించుటకు ప్రత్యేక ఎంపిక శిబిరాలను ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఫిబ్రవరి 10న ఖమ్మం ఎన్ఎస్పి క్యాంప్ రోడ్డులోని రోటరీ క్లబ్ లో ఫిబ్రవరి 11న సత్తుపల్లి లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఫిబ్రవరి 12న మధిర రైతు వేదికలో ఫిబ్రవరి 13న వైరా రైతు వేదికలో ఫిబ్రవరి 14న పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం గురువైగూడెం రోడ్డు కూసుమంచి రైతు వేదికలో ప్రత్యేక ఎంపిక శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ప్రత్యేక ఎంపిక శిబిరాలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతాయని అన్నారు. వయోవృద్ధులకు చేతి కర్రలు వాకర్స్ వినికిడి యంత్రాలు అలాగే శారీరక దివ్యాంగులకు అవసరమగు చార్జింగ్ బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్, కాలిపర్ కృత్రిమ అవయవాలు అలింకో సంస్థ నిపుణుల సహకారంతో అర్హులకు అందజేయడం కోసం ఎంపిక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.బ్యాటరీ ఆపరేటర్ ట్రై సైకిల్ పొందుటకు 16 సంవత్సరాలు పైబడి 80 శాతం వైకల్యం ఉన్నవారు వయో వృద్ధులు సంవత్సర ఆదాయం లక్షా 80 వేలు, శారీరక దివ్యాంగులు 2 లక్షల 70 వేలు ఆదాయం మించకుండా ఉండాలని, శిబిరానికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు వయస్సు ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటో బిపిఎల్ రేషన్ కార్డు వైకల్యం ధృవీకరణ పత్రం వెంట తీసుకొని రావాలని అర్హత వైకల్యం గల దివ్యాంగులు మాత్రమే హాజరు కావాలని అర్హత లేని శారీరక దివ్యాంగులు ఇతర కేటగిరి దివ్యాంగులు వచ్చి క్యాంపు వద్ద ఇబ్బంది పడవద్దని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
Posted On 2026-07-27 18:35:56
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-07-27 14:26:00
Readmore >
రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం
Posted On 2026-07-27 14:24:02
Readmore >
సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి
Posted On 2026-07-27 14:06:55
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >