| Daily భారత్
Logo




దివ్యాంగుని కన్నీళ్ళు తూడ్చిన సహస్ర ఫౌండేషన్...!!

News

Posted on 2025-02-05 15:43:17

Share: Share


దివ్యాంగుని కన్నీళ్ళు తూడ్చిన సహస్ర ఫౌండేషన్...!!

మంచానికే పరిమితమైన వికలాంగునికి వీల్ చైర్ వితరణ

డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని బాబునాయక్ తండాకు చెందిన నరేష్ పుట్టుకతోనే దివ్యాంగుడు.. పుట్టుకలోనే పోలియోరావడంతో కాళ్ళు, చేతులు లేకుండా కదలలేని స్థితిలో మంచానికే పరిమితమైనాడు. తల్లిదండ్రులు మరణించడంతో నరేష్ పెద్దమ్మ అన్నీ తానై ఆ.. దివ్యాంగున్ని పోషిస్తుంది. ఆదుకునే  వారికోసం అనేకమందికి మొరపెట్టుకుంది. ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పెన్షన్ తప్ప మరో సహాయం మాత్రం అందలేదు. కనీసం బయటకు, లోపలకు తీసుకువెళ్ళడానికి వీల్ చైర్ అయినా ఇప్పించండంటూ ప్రభుత్వకార్యాలయాల చుట్టూ తిరిగినా పలితం దక్కలేదు. కొందరు మిత్రుల ద్వారా బాబునాయక్ తండాకు చెందిన నరేష్ దీనపరిస్థితిని తెలుసుకున్న వరంగల్ లోని సహస్ర ఫౌండేషన్ బాధ్యులు స్పందించారు. విషయం తెలిసి 24గంటలు కూడా తిరగకుండానే వరంగల్ నుంచి వారు నేరుగా బుధవారం మహబూబాబాద్ లోని బాబునాయక్ తండాలో ఉన్న నరేష్ వద్దకు వీల్ చైర్ తో సహా చేరుకున్నారు. టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ చేతులమీదుగా వీల్ చైర్ ను నరేష్ కు అందజేసారు. ఎంతోమంది తెలిసిన నాయకులకు, పెద్దవాళ్ళకు, గవర్నమెంట్ సార్ లకు చెప్పాం అంతా చూద్దాం అన్నారే కానీ సహాయం చేసింది లేదంటూ నరేష్, ఆయన పెద్దమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. ఏ..తల్లి బిడ్డలో మా.‌.బాద, అవసరం తెలుసుకొని వంద కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వీల్ చైర్ ఇచ్చారు. మీరు నిండునూరేళ్ళు చల్లంగ బ్రతకాలి బిడ్డ అంటూ సహస్ర ఫౌండేషన్ బాధ్యులను దీవించారు. ఈ.. సందర్బంగా మాట్లాడిన టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ... గతంలోనూ సహస్ర ఫౌండేషన్ వరంగల్ జిల్లాలో అనేక మంచి కార్యక్రమాలు చేపట్టిందని, పుట్టు దివ్యాంగునికి వీల్ చైర్ విరాళంగా ఇవ్వడం ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ఆశీస్సులు అందజేసారు. మరింత మంది దాతలు స్పందించి నరేష్ కు సహాయం చేయాలని కోరారు. ఈ.. కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా ప్రధానకార్యదర్శి గాడిపల్లి శ్రీహరి, సహస్ర ఫౌండేషన్ బాధ్యులు అజ్మీర్, ప్రవీణ్, భరత్, రాజు, వినయ్, శివ, విష్ణు వర్ధన్, మణిదీప్, బాబునాయక్ తండావాసులు పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి

Posted On 2026-07-26 14:47:28

Readmore >
Image 1

జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం

Posted On 2026-07-26 14:40:51

Readmore >
Image 1

గాంధారి మండలంలో ఎమ్మార్పీఎస్ జండా ఆవిష్కరణ

Posted On 2026-07-26 14:36:26

Readmore >
Image 1

భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా మహిపాల్ యాదవ్

Posted On 2026-07-26 14:34:52

Readmore >
Image 1

గంప శశాంక్ జన్మదినం సందర్భంగా తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం

Posted On 2026-07-26 14:33:18

Readmore >
Image 1

పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం తగదు!

Posted On 2026-07-26 12:36:09

Readmore >
Image 1

జాగ్రత్త... ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు

Posted On 2026-07-26 10:51:59

Readmore >
Image 1

అమ్మానాన్నలు... ఒక అద్భుతమైన వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-26 07:26:29

Readmore >
Image 1

MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు

Posted On 2026-07-26 05:15:34

Readmore >
Image 1

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం

Posted On 2026-07-25 17:08:41

Readmore >