డైలీ భారత్, ఇల్లంతకుంట: రెడ్డి కులస్తుల పై తీన్మార్ మల్లయ్య అలియాస్ చింతపండు నవీన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఇల్లంతకుంట రెడ్డి సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల పోలీస్ స్టేషన్ లో బుధవారం ఫిర్యాదు చేయడం జరిగింది. తీన్మార్ మల్లయ్య రెడ్డి కులస్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్రంలో తిరగకుండా అడ్డుకుంటామని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల రెడ్డి సంఘం అధ్యక్షులు భూంపల్లి రాఘవరెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, గడ్డం రవీందర్ రెడ్డి, వడ్డిక అనిల్ రెడ్డి, కరివేదా కరుణాకర్ రెడ్డి, అన్నాడి నరేందర్ రెడ్డి, భూంపల్లి రవీందర్ రెడ్డి, కోరెం నారాయణరెడ్డి, భూంపల్లి సాంబ రెడ్డి, ఐరెడ్డి సురేందర్ రెడ్డి, నారెడ్డి మహేందర్ రెడ్డి, తూముకుంట తిరుపతిరెడ్డి, చెరుకు మల్లారెడ్డి, పారిపల్లి శ్రీనివాస్ రెడ్డి, గూడ నరేందర్ రెడ్డి, పాశం రవీందర్ రెడ్డి, కట్ట నరసింహారెడ్డి పలు గ్రామాల రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
News
రెడ్డి కులస్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి : భూంపల్లి రాఘవరెడ్డి