Posted on 2025-02-03 14:19:12
అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ చేజిక్కించుకోవడంలో భద్రాచలం కి చెందిన గొంగడి.త్రిషారెడ్డి కీలక పాత్ర
ఇండియాకు వరల్డ్ కప్ అందించిన గొంగడి త్రిషారెడ్డి కి దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ లో19 ఏళ్ల గొంగడి త్రిష సంచలనం సృష్టించారు. 7 మ్యాచుల్లో 309 రన్స్ చేసి భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు.ప్రత్యర్థి బౌలర్ల బౌలింగ్ ను ఎంతో చాకచక్యంగా ఎదుర్కొంటు ఈ టోర్నీలో ఒక సెంచరీ కూడా చేసింది.యావరేజ్ 77, స్ట్రైక్ రేట్ 144గా ఉండటం విశేషం. మహిళా క్రికెట్ విభాగంలో మిథాలీ రాజ్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ లు భారత క్రికెట్ లో సంచలనాలు సృష్టించారు ఆ వరుసలో చేరేందుకు సంసిద్ధమవుతోంది ఈ తెలుగుతేజం.అద్భుతమైన బౌలింగ్, ఔరా అనిపించే బ్యాంటింగ్తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. పల్లెటూరి నుంచి మొదలైన క్రీడాకుసుమం దండయాత్ర ప్రపంచ వేదికపై పరుగుల వరద పారిస్తోంది. మహిళల అండర్ -19 ప్రపంచకప్ చరిత్రలోనే తొలి శతకం నమోదు చేసి సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకుంది.ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు గొంగడి త్రిషనే. బౌలింగ్లోనూ సత్తా చాటి గొంగడి త్రిష 7 వికెట్లు తీశారు. భద్రాచలంకు చెందిన త్రిష ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఓపెనర్గా వచ్చి 4, 27, 49, 40, 110, 44 రన్స్ చేశారు.
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు
Posted On 2026-07-25 15:36:10
Readmore >
విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"
Posted On 2026-07-25 15:35:16
Readmore >