డైలీ భారత్, ఇల్లంతకుంట : మండల కేంద్రంలోని వాణినికేతన్ హైస్కూల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ఆవరణలో సరస్వతి దేవి విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదువుల తల్లి సరస్వతి దేవి కటాక్షంతో విద్యార్థులందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనిధి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, సంతోష్, రాజు, రమేష్, తిరుపతి, రాజు, శోభ, లావణ్య, సునంద, కళ్యాణి, మౌనిక, జలజ, శాంత, పద్మ, రేణుక, స్వాతి, మహాలక్ష్మి, షమీమాలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు
News
వాణినికేతన్ హైస్కూల్లో వసంత పంచమి వేడుకలు