Posted on 2025-02-03 12:24:14
డైలీ భారత్, గోవా డెస్క్: సినీ నిర్మాత, డ్రగ్స్ కేసులో పట్టుబడిన కేపీ చౌదరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన కేపీ చౌదరి 2016లో సినీరంగంలోకి వచ్చి కబాలి సినిమాకు తెలుగులో నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాతగా సినీ పరిశ్రమలో నిలుదొక్కుకోవాలని ప్రయత్నం చేసిన కేపీ చౌదరి అందులో విఫలం అయ్యారు. ఆ తరువాత డ్రగ్స్ కేసులో పట్టుబడటం, ఆర్థిక ఇబ్బందులతో గత కొంతకాలంగా బాధపడుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులు, డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం వంటివి ఆయన సూసైడ్ చేసుకోవడానికి కారణాలు అయ్యి ఉండొచ్చని కేపీ చౌదరి తరుపు బంధువులు భావిస్తున్నారు. నేడు ఉదయం గోవాలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. 2016 సంవత్సరంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి మూవీ తెలుగు వెర్షన్ కు కేపీ చౌదరి నిర్మాతగా వ్యవహరించారు.
అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో కేపీ చౌదరి నష్టాల పాలయ్యారు. ఆయన తెలుగు, తమిళంలో అనేక సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా పనిచేశారు. సర్దార్ గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అర్జున్ సురవరం వంటి సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. ఇక నిర్మాతగా సినిమాలలో సక్సెస్ కాలేకపోయిన ఆయన గోవాలో ఒక పబ్ ను ప్రారంభించారు. పబ్ లో కూడా నష్టాలు రావడంతో డ్రగ్స్ దందాలోకి దిగారు .
డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిర్మాత
తనకు సినీ పరిశ్రమలో ఉన్న పరిచయాలతో సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయం చేస్తున్నారు. ఇక 2023 సంవత్సరంలో డ్రగ్స్ కేసులో కెపి చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు.వరలక్ష్మీ టిఫిన్స్ డ్రగ్స్ కేసులో కేపీ చౌదరిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా నుండి 100 ప్యాకెట్ల కొకైన్ తెచ్చి సరఫరా చేస్తూ ఆయన పట్టుబడ్డారు. పోలీసులు ఆయనను పట్టుకున్నప్పుడు ఆయన వద్ద 90 ప్యాకెట్ల కొకైన్ దొరికింది.
తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకున్న కేపీ చౌదరి
మరో 10 ప్యాకెట్లు ఎవరికి విక్రయించారు అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేశారు. అనంతరం బెయిల్ పైన విడుదలైన ఆయన గోవాలోనే నివాసం ఉంటున్నారు. ఇక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కేపీ చౌదరి సోమవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు.
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు
Posted On 2026-07-25 15:36:10
Readmore >
విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"
Posted On 2026-07-25 15:35:16
Readmore >