డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బాల్ నగర్ బీఆర్ఎస్ యువ నాయకులు అవుల నరేందర్ మర్వాదపూర్వకంగా కలిశారు.ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను కలిసి పుష్పగుచ్ఛాలు అందచేశారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహం పార్టీకి క్యాడర్ ను చేయాల్సిన సమాయత్తంపై ఎమ్మెల్సీ కవితతో చర్చించినట్లు అవుల నరేందర్ తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శ్రమించాలని, పలు కీలక అంశాలను ఎమ్మెల్సీ కవిత దిశా నిర్దేశం చేసినట్లు చెప్పారు.
News
ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ యువ నాయకులు అవుల నరేందర్