| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఉపాధి హామీ పనుల్లో విషాదం

ఉపాధి హామీ పనుల్లో విషాదం

డైలీ భారత్, సిద్దిపేట:సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోజు మాదిరిగానే మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకంలో భాగంగా, తల్లి కూతురు,కూలి పనికి వెళ్లారు. మట్టిని తవ్వు తున్న క్రమంలో  పైన ఉన్న పెద్ద పెద్ద బండ రాళ్లు  తల్లి కూతురుపై పడిపోయాయి, ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. 

ఈ సంఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండ లం గోవర్ధనగిరి గ్రామంలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది, మృతులు తల్లి సరోజ, కూతురు మమత గా గుర్తించారు. 

గాయపడి న వారిని చికిత్స అందించేం దుకు సమీపం లోని ఆసుపత్రికి తరలిం చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Previous అమల్లోకి కోడ్.. కొత్త స్కీమ్స్కు బ్రేక్..!!
Next ఓ మహాత్మ... ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించు
ADVERTISEMENT