| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అమల్లోకి కోడ్.. కొత్త స్కీమ్స్కు బ్రేక్..!!

అమల్లోకి కోడ్.. కొత్త స్కీమ్స్కు బ్రేక్..!!

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: 7 ఉమ్మడి జిల్లాల్లో అమల్లోకి వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్

పాత పథకాల అమలు తప్ప.. కొత్తవాటికి నో చాన్స్

జిల్లాల్లో మంత్రుల శంకుస్థాపనలు బంద్

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎలక్షన్కోడ్ అమల్లోకి రావడంతో కొత్త స్కీమ్స్కు బ్రేక్ పడింది.

2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ బుధవారం షెడ్యూల్ రిలీజ్ చేయగా.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వరంగల్-- -ఖమ్మం- -నల్లగొండ ఉపాధ్యాయ, మెదక్- --నిజామాబాద్-- -ఆదిలాబాద్- -కరీంనగర్ ఉపాధ్యాయ, మెదక్- - నిజామాబాద్--- ఆదిలాబాద్-- కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 7 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 40 రోజులు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండనున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో తప్ప మిగతా అన్ని ఉమ్మడి జిల్లాలో కోడ్ వర్తిస్తుంది.

ఈ నేపథ్యంలో మార్చి 8 వరకు ఇప్పటికే ప్రకటించిన స్కీమ్స్ను మాత్రమే అమలు చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల మంజూరు స్కీమ్లను ప్రారంభించింది. లబ్ధిదారులకు నగదు బదిలీతోపాటు ఫుడ్ సెక్యూరిటీ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సాంక్షన్ పత్రాలు అందచేసింది. ఇవి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగనున్నాయి. 

శంకుస్థాపనలు బంద్

ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతో జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలు తగ్గనున్నాయి. నిత్యం జిల్లాల్లో మంత్రులు, జిల్లా ఇన్ చార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. కోడ్ అమల్లోకి రావడంతో ఈ ఏడు ఉమ్మడి జిల్లాల్లో శంకుస్థాపనలు బంద్ కానున్నాయి. బుధవారం పలువురు మంత్రులు జిల్లాల పర్యటనలకు వెళ్లాల్సి ఉండగా.. కోడ్ అమల్లోకి రావడంతో వాటిని రద్దు చేసుకున్నారు. 

వరుసగా ఎన్నికలు

ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే నెల 27న జరగనుండగా.. మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎన్నికల పక్రియ మార్చి 8న ముగియనున్నది. మరుసటి రోజు ఎన్నికల కోడ్ ముగుస్తుంది. మార్చి 29న 3 ఎమ్మెల్యే కోటా, ఆగస్ట్ 6న హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ టర్మ్ సైతం ముగియనున్నది. వీటికి కూడా త్వరలో ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఈ లోపే లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

వచ్చే నెలలో ఒక దశ లేదా రెండు దశల్లో లోకల్ బాడీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. మార్చిలో ఈ పక్రియ ముగియనుందని సమాచారం. ఇక లోకల్ బాడీ పూర్తయ్యాక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించే అవకాశముందని తెలుస్తున్నది. ఈ ఏడాది చివరలో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరగనున్నట్టు సమాచారం. 2020 డిసెంబర్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగ్గా తర్వాత ఏడాది ఫిబ్రవరిలో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. వీటితోపాటు గ్రేటర్ వరంగల్, ఖమ్మంతో పాటు పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల టర్మ్ కూడా ముగియనున్నది.

నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం

రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రచారానికి బీజేపీ రెడీ అయింది. ఫిబ్రవరి 2 నుంచి మూడు సెగ్మెంట్లలో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలూ ప్రచారంలో పాల్గొనేలా షెడ్యూల్ రెడీ చేస్తున్నారు. నిజామాబాద్‌--కరీంనగర్--ఆదిలాబాద్--మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గా మల్క కొమరయ్య, అదే సెగ్మెంట్లో గ్రాడ్యుయేట్ స్థానం నుంచి అంజిరెడ్డి, వరంగల్--ఖమ్మం--నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తంరెడ్డి పేర్లను బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. 

వారంతా ప్రస్తుతం ప్రచారాన్ని ప్రారంభించారు. పోలింగ్కు నెల రోజులు కూడా లేకపోవడంతో ఇతర బీజేపీ నేతలు ప్రచారాన్ని వెంటనే ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎన్నికల ఆఫీసులను ప్రారంభించేందుకు బీజేపీ రెడీ అయింది. వచ్చేనెల 2న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకుగానూ ఇప్పటికే బీజేపీ జిల్లా, అసెంబ్లీ, మండలాల వారీగా ఇన్ చార్జ్ లనూ నియమించింది.

Previous ప్రభుత్వ కళాశాల నిర్మాణం ఓ చరితాత్మకం కార్యక్రమం : ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్,ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next ఉపాధి హామీ పనుల్లో విషాదం
ADVERTISEMENT