| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఓ మహాత్మ... ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించు

ఓ మహాత్మ... ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించు

ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: టిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ఈరోజుకి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు పూర్తవుతుంది కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ వరకు హామీలు అమలు చేయలేదు. అందుకు నిరసనగా ఈరోజు జనవరి 30న అన్ని మండల కేంద్రాల్లో గాంధీ విగ్రహానికి వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేయమని గౌరవ మాజీ మంత్రివర్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఖమ్మం నియోజకవర్గం నగర BRS పార్టీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ లో ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహానికి నివాళులర్పించి  వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం నగర BRS పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్,జె,సి కృష్ణ, మీడియాతో మాట్లాడుతూ...గాంధీ అడుగుజాడల్లో స్వరాష్ట్రాన్ని సాధించి వారి ఆశయాలు స్ఫూర్తిగా, టిఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణను ప్రగతి పథంలో నడిపించాం. సబ్బండ వర్గాల సంక్షేమ లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టాం. తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా సమున్నతంగా మార్చి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాము. నేడు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఈ జనవరి 30న 420 రోజులు పూర్తి చేసుకుంటుంది మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రతినిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో పంచిన గ్యారెంటీ కార్డుకు ఇచ్చిన 420 హామీలకు పాతరేసి అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమాలతో కాలం వెళ్లదీస్తున్నారు. మీ అబద్ధపు హామీలు నమ్మిన ప్రజలు మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 420 రోజుల్లో రోజుకు రైతు చొప్పున 412 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గురుకులాల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కల్తీ ఆహారం తిని 55 మందికి పైగా విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఇక రైతుల విషయానికొస్తే రైతు భరోసా కు 15000 రైతు కూలీలకు ₹12,000 ఇప్పుడు రైతు భరోసా 12000 అంటూ ఒకసారి సంక్రాంతి మరోసారి జనవరి 26 ఇస్తామని ఇప్పుడు మళ్లీ మార్చి 31 అంటున్నారు. రైతు కూలీలకు 12,000 అన్నది పెద్ద బూటకం అప్పుడు రైతుబంధు 10000 బిక్షం అన్న రేవంత్ రెడ్డి 420 రోజుల గడుస్తున్న రైతు భరోసా ఇవ్వలేదు. రైతుబంధు సంవత్సరానికి రెండు విడతలుగా క్రమం తప్పకుండా ఎకరాకు పదివేలు చొప్పున మొత్తం 73,162 కోట్లు నేరుగా రైతుల అకౌంట్లో జమ చేసిన ఘనత మా కేసీఆర్ ప్రభుత్వానిది. అసలు మహాత్మా గాంధీ పేరుతో గద్దెనెక్కిన డూప్లికేట్ గాంధీలు ఇచ్చిన దొంగ హామీల వైఫల్యాలను ఎండ కట్టాలి 420 హామీలను నమ్మి ఓటేసిన పాపానికి గొంతు కోసిన అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకుంటున్నాము. దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ బిడ్డలు మళ్లీ అవే కష్టాలు అవే కన్నీళ్ళలో చిక్కుకొని విలవిలలాడుతున్న వేళ ఈ దద్దమ్మ కాంగ్రెస్ సర్కార్కు 420 హామీలు అమలు చేసే బుద్ధినివ్వాలని  మిమ్మల్ని స్వయంగా ప్రార్థిస్తున్నాం బాపు అంటూ వారికి  వినతి ఇవ్వటం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీలను ప్రజలకు ఇచ్చేంతవరకు ఈ ప్రభుత్వం వెంట నిత్యం పడుతూనే ఉంటామని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజల మద్దతుతో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పడం జరిగినది.

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ SK మక్బుల్, స్థానిక కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్, బొమ్మెర రామ్మూర్తి, కార్పొరేటర్ బుర్రి వెంకట్, కూరాకుల వలరాజు, భోజట్ల రామ్మోహన్, డోన్ వాన్ రవి, మాజీ కౌన్సిలర్లు కొప్పెర నరసింహారావు, దడాల రఘు, మూడో పట్టణ యూత్ కన్వీనర్ మాటేటి కిరణ్, నగర ప్రచార కార్యదర్శి షకీన, రెండో పట్టణ మైనార్టీ అధ్యక్షుడు అబ్బాస్,రెండో పట్టణ యూత్ కన్వీనర్ బలుసు మురళీకృష్ణ, ఉద్యమకారుడు బురాన్, షేక్ ఉస్మాన్, తోడేటి లింగరాజు, మేరీ, పిల్లుట్ల కృష్ణ, బాసెట్టి ఫణి కృష్ణ, దండుగుల రాంబాబు,నారమళ్ళ వెంకన్న, నన్నే,నారపోగు వెంకటేష్, పోలెపొంగు వెంకట్, పిట్టల తిరుమల్, నాగరాజు, కూచిపూడి కిషోర్, నామవరపు సతీష్, దేవరకొండ నాగేశ్వరావు,ఊర్మిళ రంగరాజు, మాదవి,ఆలకుంట్ల రవి ,ఎల్లయ్య ,బాలకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు

Previous ఉపాధి హామీ పనుల్లో విషాదం
Next రేషన్ డీలర్ల క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్, గూడెం మహిపాల్ రెడ్డి
ADVERTISEMENT