డైలీ భారత్ ,భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెం రైటర్ బస్తీ ఎల్ఐసి ఆఫీస్ పక్కన ఉన్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో 76వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా పినపాక మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయ ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి జై తెలంగాణ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఫలితంగానే నేడు వెనుకబడిన వర్గాల వారు చట్టసభలలో, రాజకీయాలలో, ఉద్యోగాలలో ఉన్నత స్థాయికి చేరగలుగుతున్నారని అన్నారు. భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్య భారతదేశం ఒకే తాటిపై నిలిచిందంటే అది రాజ్యాంగం వల్లే సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా పార్టీ నాయకులు సంకుబాపన అనుదీప్, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, లక్ష్మిదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, లక్కినేని సురేందర్, తొగరు రాజశేఖర్, టీబీజీకేఎస్ నాయకులు కాపు కృష్ణ, కాంపల్లి కనకేష్, చుంచుపల్లి మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, ముత్యాల రాజేష్, సింధు తపస్వి మరియు తదితరులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పాల్గొన్నారు.
News
బిఆర్ఎస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు