డైలీ భారత్, నారాయణపేట : నారాయణపేట మండలం సింగారం చౌరస్తాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మహిళ మాణిక్యమ్మ మృత దేహాన్ని స్వయంగా పోలీసులు మోసుకెళ్లి తమ వాహనంలో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్ళారు. చిద్రమైన మహిళ తల భాగాలను బట్టలో వేసి తీసుకెళ్ళారు. ప్రజలు ఎవరు ముందుకు రాకపోవడంతో పట్టణ ఎస్సైలు వెంకటేశ్వర్లు, రాముడు, కానిస్టేబుల్ భానుప్రకాష్ మృతదేహాన్ని తీసుకెళ్ళారు. ప్రజలు శభాష్ పోలీసులు అంటూ ప్రశంసించారు.
News
మహిళ మృతదేహాన్ని మోసుకెళ్ళిన పోలీసులు