డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సీ కత్తిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో నడి గోదావరి నది లో భారీ యంత్రలాతో ఇసుక, లారీలలో లోడింగ్ న్యూ డెమోక్రసీ చర్ల మండలం సి కత్తిగూడెం గ్రామ పంచాయతీ వీరాపురం గ్రామంలో ఉన్న ఇసుకర్యాంప్ అనేది ముఖ్యమంత్రి అండతోని 16 జెసిపి భారీ యంత్రాలతో నడి గోదావరిలో వేల లారీలల్లో ఇసుక లోడ్ చేస్తున్నారని సిపిఐ ఎంఎల్ న్యూడెమోగ్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ నాయకులు కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు.ఈ ఇసుకర్యాంప్ అనేది అధిక లోతు తవ్వకాలు జరపడం వలన భూగర్భ జలాలు అడుగంటిపోయి, నీరు శాతం తగ్గిపోయి, రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని వారు అన్నారు. సి కత్తిగూడెంగ్రామ పంచాయతి లో అందరూ మిర్చి రైతులే ఉండటం కారణంగా మిర్చి పంట కోసి కల్లాలల్లో ఆరబెట్టాలంటే ఇసుక లారీలు కారణంగా దుమ్ము ధూళితో మేలుకాయలు కాస్త తాలుకాయగా మారిపోయితాయి ఆరబెట్టిన మిర్చి పంట నాణ్య తగ్గి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వారన్నారు, పంట కాలం అయిపోయే వరకు ఇసుకర్యాంప్ ను నిలుపుదల చేయాలని దీనికి రైతులు ఉద్యమాల బాట పట్టాలని ముసలి సతీష్ పిలుపునిచ్చారు. మిర్చి పంట మీద రైతులకు గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఇసుకర్యాంప్ ల కారణంగా లారీలతో వచ్చే దుమ్ము ధూళితో పంట మొత్తం నాశనం అయిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుందని వారన్నారు. ఇసుకర్యాంప్ ల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోవడం కారణంగా పంట పొలాల కు నీరు అందక రైతులు తీవ్రగా నష్టపోయే పరిస్థితి ఉందని దేశానికి అన్నం పెట్టే రైతన్న బ్రతుకు గందరగోళంగా మారుతుందని ఇప్పటికీ దేశంలో చూసుకుంటే పండించే వారు తగ్గిపోతున్నారు తినేవారు పెరిగిపోతున్నారని స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు దాటుతున్న రైతుల బతుకులు మాత్రం మారడం లేదని సి కత్తి గూడెం గ్రామ పంచాయతీలో కేవలం ఒక వర్గానికే ఉపాధి అనేది దొరుకుతుంది,మిగతా వర్గాలకు ఉపాధి దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీనిపైన అధికారులు మాత్రం చర్యలు అనేటి శూన్యమని భద్రాచలం నియోజకవర్గం లో ఉన్న ఎమ్మెల్యే ప్రజల ఓట్లకే పరిమితం గాని ప్రజల సమస్యలు మాత్రం ఆయనకు చీమకుట్టినట్టుగా కూడా అనిపించటం లేదు దీన్ని బట్టి చూస్తే అధికారులకు ఎమ్మెల్యేలకు మంత్రులకు ముడుపులు అనేటివి పెద్ద ఎత్తున ముట్టాయి అనేది అర్థం అవుతుంది. కావున తక్షణమే రైతుల పంటలు చేతికి వచ్చేవరకు సి కత్తిగూడెం లో ఉన్న ఇసుక ర్యాంపు నిలుపుదల చేయాలని చెప్పి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతోంది, లేనియెడల ప్రజా ఉద్యమాలు ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించడం జరుగుతా ఉంది.
News
మంత్రుల అండతో అక్రమ ఇసుక మైనింగ్