ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూఖ్ నగర్ మండలం కంసాన్ పల్లి గిరాయి గుట్ట లో శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం జరిగింది. లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి పాల్గొన్నారు. కళ్యాణ మాసంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా సుఖ సంతోషాలతో, ఆనందోత్సవాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, కుటుంబం ఇంటిల్లిపాది పాడిపంటలతో, రైతన్నలందరూ పంటల సమృద్ధితో ఆర్థిక అభివృద్ధిలో ఎదుగుదల ఉండి సమాజంలో ఉన్నత స్థాయికి రావాలని, రైతే మన దేశానికి రాజ్యం అనే నానుడిని నిజం చేయాలని భగవంతుడు సన్నిధిలో ఆకాంక్షించారు. అలాగే లక్ష్మీనరసింహస్వామి దివ్య ఆశీస్సులు ఉమ్మడి పాలమూరు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫరుక్ నగర్ మండలం బిఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ వీరేశం గుప్తా, బీమారం మాజీ సర్పంచ్ రాములు నాయక్, ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ రాజేష్
కంసాన్ పల్లి మాజీ ఉప సర్పంచ్ యాదయ్య గౌడ్ బిఆర్ఎస్ నాయకులు తోట్ల బాలరాజ్, కాకరజాలమల్లేష్, శివ, రామకృష్ణారెడ్డి, వెంకటయ్య, యాదవ్ పల్లె, దశరథ్, అల్లి నరేష్, మోహన్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.