| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేడు హైదరాబాదులో మరోసారి ఐటీ దాడులు

నేడు హైదరాబాదులో మరోసారి ఐటీ దాడులు

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో మరోసారి ఐటీదాడులు కలకలం రేపాయి.

ఇటీవల వరుసగా రాజకీయ నేతలే టార్గెట్‌గా ఐటీ, ఈడీ దాడులు జరగాయి. కాంగ్రెస్ నేతలు పారిజాత నర్సింహ్మా రెడ్డితో మెుదలైన ఈ దాడులు ఆ తర్వాత కేఎల్ఆర్, మంత్రి సబితా అనుచరులు, జానారెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి, రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ నేతలు గడ్డం వినోద్, వివేక్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపిన సంగతి పాఠకులకు తెలిసిందే. 

తాజాగా.ఈరోజుఉదయం నుండి హైదరాబాద్ పాత బస్తీలోని బడా వ్యాపారులే టార్గెట్‌గా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్, కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.

కోహినూర్, కింగ్స్ గ్రూపుల పేరుతో వీరు నగరంలో ఫంక్షన్‌హాళ్లు, హోటల్స్ నిర్వహిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుతున్నట్లుగా ఐటీ శాఖ అనుమానం వ్యక్తం చేసింది.

అందులో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు  సమాచారం...

Previous రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్..
Next సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు
ADVERTISEMENT