| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు

సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు

డైలీ భారత్, తెలంగాణ: అక్టోబరు 30న బాన్సువాడలో జరిగిన సభలో కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది.

కేసీఆర్‌కు నోటీసులు అందజేయాల్సిందిగా సీఈసీని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. సీఈవో శుక్రవారం రాత్రి కేసీఆర్‌కు నోటీసులు అందజేశారు.

కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. NSUI అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ చేసిన ఫిర్యాదుపై ఈసీ నోటీసులు అందజేసింది.

దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి తర్వాత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఈసీ కోట్ చేసింది.

కత్తితో దాడి చేసిన వారికి తెలంగాణ సమాజం గుణపాఠం చెప్పాలని, తాము దాడి చేయడానికి కూడా మొండిదో ఏదో కొత్తి దొరుకుతుందని కేసీఆర్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ అభ్యంతరం చెప్పింది.

Previous నేడు హైదరాబాదులో మరోసారి ఐటీ దాడులు
Next తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ? C.M అయ్యే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంది?
ADVERTISEMENT