| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘనంగా మాజీ జెడ్పిటీసి శ్యాంసుందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ జెడ్పిటీసి శ్యాంసుందర్ రెడ్డి జన్మదిన వేడుకలు


హాజరైన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి

ఎఫ్ సి ఎన్ ఫౌండేషన్ లో అనాధలకు అన్నదానం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తదితరులు హాజరైన కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు శ్యాంసుందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. 


ఈ సందర్భంగా ఎఫ్ సి ఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాధలకు భోజనాలను అందజేశారు. పలువురు వృద్ధులకు భోజనాన్ని స్వయంగా వడ్డించారు. పట్టణ శివారులోని ఎఫ్ సి ఎన్ లో మామిడి శ్యాంసుందర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన మండలాల నాయకులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. పూల బొకేలు శాలువాలతో శ్యాంసుందర్ రెడ్డిని తమ అభిమానంతో ముంచేత్తారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు..

Previous పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next రచయితల సంఘం ఆధ్వర్యంలో అలిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతి వేడుకలు
ADVERTISEMENT